Home / ISRO
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి PSLV-C 56 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. దీనిద్వారా 7 విదేశీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి పంపించారు. ఇందులో సింగపూర్‌కు చెందిన డీఎస్టీఏ ఎస్టీ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన డీఎస్ ఎస్ఏఆర్ఉపగ్రహంతోపాటు నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెంచిన వెలాక్స్-ఏఎం, ఆర్కేట్, స్కూబ్-2, న్యూలియాన్, గెలాసియా-2, ఓఆర్బీ-12 శాటిలైట్లు ఉన్నాయి. ఇవన్నీ సింగపూర్‌కు చెందినవే కావడం విశేషం.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రేపు ఉదయం 6.30 గంటలకు PSLV C-56 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇక, దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది.
Chandrayaan-3: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ –3 ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలయ్యింది. ఏపీలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35కు ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్ ల్యాండర్, రోవర్‌ను చంద్రుడిపైకి పంపనున్నారు శాస్త్రవేత్తలు.
ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ – ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తి అయ్యింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం వేదికగా జరిగిన ఈ ప్రయోగంలో జీఎస్ఎల్వీ – ఎఫ్ 12 రాకెట్ నింగి లోకి దూసుకెళ్లి.. 2వేల 232 కిలోల బరువుతో NVS -01 ఉపగ్రహాన్ని మోసుకెళ్లి నిర్ణీత వ్యవధిలో కక్ష్యలో ప్రవేశపెట్టింది. దాదాపు 19 నిమిషాల ప్రయాణం తర్వాత.. ఎన్వీఎస్-O1 ఉపగ్రహం ఖచ్చితంగా
శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్.. వన్ వెబ్‌కు చెందిన 36 ఉప గ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ను ప్రపంచం మొత్తానికి అందించే శాటిలైట్స్‌ను ఇస్రో అంతరిక్షంలోకి పంపించింది. శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి 36 ఉపగ్రహాలతో కూడిన సముదాయాన్ని ప్రత్యేకంగా రూపొందించిన లాంచ్ వెహికల్ మార్క్ త్రీ భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
శ్రీహరికోట నుంచి చిన్న ఉపగ్రహ వాహననౌక SSLV-D2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఉపగ్రహ ప్రయోగం జరిగింది.
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ లో పరిస్థితిని జిల్లా యంత్రాంగంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షిస్తున్నాయి.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ54 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శనివారం ఉదయం 11.56 గంటలకు రాకెట్ నింగిలోకి ఎగిరింది.
భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన రాకెట్, విక్రమ్-ఎస్ శుక్రవారం శ్రీహరికోట స్పేస్‌పోర్ట్‌లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుండి ఉప-కక్ష్య మిషన్‌లో విజయవంతంగా ప్రయోగించబడింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్ర సృష్టించేందుకు అడుగులు వేస్తోంది. అంతరిక్ష ప్రయోగాలకు ప్రయివేట్ రంగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మొట్ట మొదటిసారి ఓ ప్రయివేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.