Home / Israeli Airstrikes
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సుమారుగా 60 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. నిరాశ్రయులకు షెల్టర్ జోన్ గా ఉన్న పాఠశాల, మరొక ప్రాంతంపై ఈ దాడులు జరిగాయి. కాగా, దాదాపు 10 నెలలుగా కొనసాగుతున్న వివాదంలో కాల్పుల విరమణ చర్చలు మరోసారి నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ డెయిఫ్ లక్ష్యంగా జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో దక్షిణ గాజాలో శనివారం కనీసం 71 మంది పాలస్తీనియన్లు మరణించారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.ఖాన్ యూనిస్ సమీపంలోని భవనంలో డీఫ్ దాక్కున్నట్లు వచ్చిన నివేదికల తర్వాత డెయిఫ్ మరణించాడా లేదా అన్నది అస్పష్టంగా ఉందని భద్రతా అధికారి ఒకరు తెలిపారు.
ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థి శిబిరంపై మంగళ, బుధవారాల్లో రెండు రౌండ్ల ఇజ్రాయెల్ దాడుల్లో సుమారుగా 195 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ మీడియా కార్యాలయం పేర్కొంది.
గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గత 24 గంటల్లో 700 మంది మరణించారు. మరోవైపు గాజాలో విద్యుత్హ కొరణంగా ఆసుపత్రుల్లో వైద్యనదుపాయాలు నిలిచిపోయాయని దీనితో మరిన్ని మరణాలు నమోదయ్యే అవకాశముందని తెలుస్తోంది.