Home / goods train
ఒడిశాలోని జాజ్‌పూర్ కియోంజర్ రోడ్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు కిందపడి ఆరుగురు కార్మికులు మరణించారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని రైల్వే అధికారి తెలిపారు.భారీ వర్షం పడటంతో గూడ్స్ కిందకు చేరిన కూలీలు అది అకస్మాత్తుగా గాలులకు కదలడంతో దానికిందే ప్రాణాలు వదిలారు.
సోమవారం తెల్లవారుజామున ఒడిశాలోని డుంగురి నుంచి బార్‌గఢ్‌కు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సున్నపురాయితో వెళ్తున్న గూడ్స్ రైలులోని అనేక వ్యాగన్లు బార్‌ఘర్ జిల్లా సంబర్ధరా సమీపంలో పట్టాలు తప్పాయి. ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొని కనీసం 275 మంది ప్రాణాలు కోల్పోయిన మూడు రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది.
జార్ఖండ్‌లోని ధన్‌బాద్ డివిజన్లో కోడెర్మా, మన్పూర్ రైల్వే సెక్షన్ మధ్య బొగ్గు వ్యాగన్లతో వెళ్లుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 53 బోగీలు బోల్తా పడ్డాయి. వ్యాగన్లలోని బొగ్గు చిందర వందరగా పట్టాలపై పడ్డాయి. కొన్ని వ్యాగన్ల చక్రాలు ఊడి పక్కకు పడిపోయాయి.