Last Updated:

Train Accident: జార్ఖండ్ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఉల్టా కొట్టిన బోగీలు

జార్ఖండ్‌లోని ధన్‌బాద్ డివిజన్‌లో కోడెర్మా, మన్పూర్ రైల్వే సెక్షన్ మధ్య బొగ్గు వ్యాగన్లతో వెళ్లుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 53 బోగీలు బోల్తా పడ్డాయి. వ్యాగన్లలోని బొగ్గు చిందర వందరగా పట్టాలపై పడ్డాయి. కొన్ని వ్యాగన్ల చక్రాలు ఊడి పక్కకు పడిపోయాయి.

Train Accident: జార్ఖండ్ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఉల్టా కొట్టిన బోగీలు

Jharkhand: జార్ఖండ్‌లోని ధన్‌బాద్ డివిజన్‌లో కోడెర్మా, మన్పూర్ రైల్వే సెక్షన్ మధ్య బొగ్గు వ్యాగన్లతో వెళ్లుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 53 బోగీలు బోల్తా పడ్డాయి. వ్యాగన్లలోని బొగ్గు చిందర వందరగా పట్టాల పై పడ్డాయి. కొన్ని వ్యాగన్ల చక్రాలు ఊడి పక్కకు పడిపోయాయి.

నేటి ఉదయం 6.24 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకొనిందని ధన్ బాద్ డివిజన్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ఎలాంటి రైళ్ల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిన్నట్లైయింది. ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు.

బర్వాదిహ్, గయా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గోమో, ధన్‌బాద్ అధికారుల బృందం సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని నియంత్రణ చర్యలు చేపట్టారు. పలు రైళ్ల రాకపోకలను మరో మార్గం మీదుగా మళ్లించారు. కొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేసిన్నట్లు ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:Kejriwal Appeal: దేశాభివృద్ధికి కరెన్సీ నోట్లపై వినాయక-లక్ష్మీ ల ఫోటోలు అవసరం…ప్రధానికి కేజ్రీవాల్ విజ్నప్తి

ఇవి కూడా చదవండి: