Home / formula e race
‘రెండు అంతస్తుల బస్సులో ప్రయాణం చేస్తూ హైదరాబాద్ అందాలను చూడటం ఒక గొప్ప అనుభూతి’.. ఇది ఓ నెటిజన్ చేసిన ట్వీట్..ఇపుడు అదే ట్వీట్ అలనాటి చారిత్రిక డబుల్ డెక్కర్ వైభవాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు కారణం అయింది.
Formula race: వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. హైదరాబాద్ వేదికగా జరిగే.. ఈ రేసింగ్ ఫార్ములా కోసం ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపారు. దీంతో వాహనదారులు గమనించి.. సూచించిన మార్గాల్లో వెళ్లాలని కోరారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు.
ఫార్ములా ఈ కార్ల రేసింగ్ కారణంగా హైదరాబాద్ లో ఐదు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. కొన్ని రహదారులలో దారి మళ్లింపులు చేపట్టగా మరి కొన్ని రోడ్లపై రాకపోకలను పూర్తి నిలిపివేయనున్నారు ట్రాఫిక్ అధికారులు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ రోడ్డును శుక్రవారం నుంచి సోమవారం వరకు మూసివేయనున్నారు.
హైదరాబాద్ లో ఈనెల 19, 20వ తేదీల్లో మరియు వచ్చేనెల 10,11వ తేదీల్లో ఫార్ములా ఈ రేస్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా-ఈ రేస్ పోటీలకు హుస్సేన్‌సాగర్ వేదిక కానుంది.