Home / Football News
పోర్చుగల్ ఫుట్ బాల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియా యొక్క అల్ నాసర్ క్లబ్ తో రెండున్నర సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసాడు.
ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022 టోర్నీలో క్రొయేషియా, అర్జెంటీనాకు మధ్య జరిగిన మ్యాచ్ లో మెస్సీ సేన విజయం సాధించింది. ఈ విజయంతో అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడేందుకు మెస్సీ ఒక్క అడుగుదూరంలో ఉన్నాడు.
ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మైదానంలో వెక్కివెక్కి ఏడ్చాడు. తన కెరీర్‌లో కనీసం ఒక్క ప్రపంచకప్ అయినా సాధించాలనుకున్న ఈ సాకర్ సూపర్ స్టార్ కల చెదిరింది. ఖతార్ వేదికగా తాజాగా మొరాకోతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 1-0 తేడాతో పోర్చుగల్ ఓటిమి పాలయ్యింది. దానితో బాధతో ఇంటికి పయనమైంది.
ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో అతి పెద్ద సంచలనం నమోదైంది. వరల్డ్ నెంబర్-3 జట్టు అయిన అర్జెంటీనాను ఆసియా పసికూన అయిన సౌదీ అరేబియా (51వ ర్యాంకు) ఓడించింది. అంతేకాకుండా వరుసగా 36 మ్యాచ్ ల్లో గెలిచి టైటిల్ ఫేవరేట్‌గా ప్రపంచ కప్ బరిలోకి దిగిన మెస్సీ సేన దూకుడుకు సౌదీ అడ్డుకట్ట వేసింది.
ఖతార్ వేదికగా ఫిఫా పురుషుల ప్రపంచ కప్ ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యింది. ఆరంభ మ్యాచ్ లో ఈక్వెడార్ 2–0 తేడాతో ఆతిథ్య ఖతార్ జట్టును ఓడించి శుభారంభం చేసింది. ఈ మ్యాచ్ జరుగుతుండగా ఈక్వెడార్ ఆటగాళ్లను సపోర్ట్ చెయ్యడానికి వచ్చిన ప్రేక్షకులు ‘మాకు బీర్లు కావాలి’ అంటూ గోలగోల చేశారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న ఫుట్‌బాల్ టోర్నమెంట్, ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ లో ఆదివారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతోంది.
ఫుట్‌బాల్ దిగ్గజం అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా 1986 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టుతో క్వార్టర్స్‌లో కొట్టిన ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. కాగా మారడోనా కొట్టిన ఆ బంతిని తాజాగా నిర్వహించిన వేలంలో దాదాపు 2.4 మిలియన్ డాలర్లు అనగా మన కరెన్సీలో రూ. 19.5 కోట్లకు అమ్ముడుపోయింది.
ఖతార్‌లో జరిగే 2022 ప్రపంచకప్ తన కెరీర్‌లో "ఖచ్చితంగా" చివరిది అని అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ గురువారం ప్రకటించారు.