Home / food news
కరివేపాకు అంటే మనలో చాలా మందికి చిన్నచూపు భోజనంప్లేట్ లో కనిపించగానే దాన్ని తీసి పక్కన పెడతాం. అయితే కరివేపాకును తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూసేద్దాం.
నేటి తరం ప్రజలకు చాలా మందికి మన సంప్రదాయ వైద్యం గురించి కానీ ఆహార వ్యవహారాల గురించి కానీ పెద్దగా తెలియదని చెప్పవచ్చు. అయితే అలాంటి పురాతన సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో ఒకటయిన పిండి కూర ఆకు దీనిని పాషాణభేది, కొండపిండి చెట్టు, తెలగ పిండి చెట్టు అని కూడా అంటుంటారు. మరి ఈ మొక్క విశిష్టతలేంటి ఎక్కడ దొరకుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం.
ఆందోళన, ఒత్తిడి (స్ట్రెస్) అనేవి ఈరోజుల్లో ప్రతీ మనిషికీ చాలా కామన్ అయిపోయాయి. అయితే ఇంలాంటి సమయాల్లో కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల స్ట్రెస్, ఆందోళనను అదుపులో ఉంచవచ్చని చెప్తున్నారు నిపుణులు. సరైన పోషకాహారం కూడా మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలేంటో తెలుసుకుందాం.
సాధారణంగా చాలా పండ్లు, కూరగాయలకు తొక్కను తీసేసి వండడం, తినడం చేస్తుంటాం. కానీ అది సరైన పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని కూరగాయలు, పండ్లకు తొక్కలను తీసి పారేయడం వల్ల ఆ తొక్కలోనే ఉన్న పోషకాలన్నీ పోతాయి. మరి అలాంటి వెజ్జీస్ మరియు ఫ్రూట్స్ ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకోండి.
పుట్టగొడుగులను కొందరు మాంసాహారమని మరికొందరు శాఖాహారమని అంటున్నారు. అయితే ఇది వెజ్ ఆర్ నాన్ వెజ్ అనే దాని మీద పలువురు పలు రకాలుగా చెప్తున్నారు. పుట్టగొడుగుల కూర చూడగానే నోరూరినవారంతా కచ్చితంగా మాంసాహారులే అయ్యుంటారు. ఎందుకంటే శాకాహారులెవ్వరూ ఈ కూర తినేందుకు ఇష్టపడరు.
ఒక్కో పండుగకు ఒక్కో విశిష్టత ఉంటుంది. దానికి తగినట్టుగానే వస్త్రధారణ, అలంకరణ, వంటకాలు ఉంటాయి. సంక్రాంతికి అరిసెలు, అట్లతద్దికి అట్లు ఎలాగైతే ఆనవాయితీగా వస్తున్నాయో అలానే దీపావళికి కంద దుంపతో వండిన వంటకాలు తినాలనే ఆచారం ఉంది. ఇలా దీపావళి రోజున కంద తినడం వల్ల సంపద కలిసొస్తుందని నమ్మకం.
పుదీనాను ఒక ఔషధాల గని అని చెప్పుకోవచ్చు. ఇది దాదాపు అందరి ఇళ్లల్లోనూ విరివిగా లభిస్తుంది మరియు అన్ని వంటల్లోనూ దీనిని వివిధ రూపాల్లో వాడుతుంటారు. అంతేకాదండోయ్ పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో చూసేద్దామా..
ఈ పటాకులను చూస్తే మాత్రం కాల్చకుండా అమాంతం నోట్లో వేసుకుంటాం. అదేంటి టపాసులను నోట్లో వేసుకోవచ్చు అంటున్నారు.. పటాకులు విషపూరితం కదా అనుకుంటున్నారు కదా.. కాదండీ ఈ టపాసులు మాత్రం తియ్యతియ్యగా నోటిలో వేస్తే కరిగిపోతాయి. మరి వాటి విశేషాలేంటో తెలుసుకుందామా..
నాన్ వెజ్ పేరు వినగానే మనకి బాగా గుర్తు వచ్చేది చికెన్, బిర్యాని. ఈ రోజుల్లో చాలా మంది మాంసం బాగా తింటున్నారు. దీన్ని హేట్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. అందులోనూ సెలవు దొరికితే చాలు చికెన్ చేసుకొని తినేస్తూ ఉంటారు. మనలో కొంత మందికి చికెన్ స్కిన్‌తో తినేస్తారు.