Home / Elon Musk
తాజాగా గురువారం నాడు ఈ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ ఫాం అయిన ట్విట్టర్ పలువురు జర్నలిస్టుల ఖాతాలను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు మస్క్.
మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ నకిలీ ఖాతాలను నిరోధించడానికి ధృవీకరించబడిన బ్లూ టిక్ పొందడానికి ఫోన్ ధృవీకరణ అవసరమని తెలిపింది.
ట్విట్టర్లో సిబ్బందిని సగానికి సగం తగ్గించడంతో ఉద్యోగుల్లో పని భారం భారీగా పెరిగిపోయింది. దీంతో మస్క్ మదిలో కొత్త ఐడియా వచ్చింది.
మెదడులోని ఆలోచించనలతోనే పనులు చెయ్యగలిగితే ఎలా ఉంటుందంటారు. కలగా ఉండే ఈ ఆలచనలకు ప్రాణం పోస్తున్నారు స్పేస్ఎక్స్, న్యూరాలింక్ అధినేత ఎలాన్ మస్క్. కూర్చున్న చోటునుంచే ఎలాంటి కదలికలు లేకుండా మెదడు ద్వారానే ఆపరేట్ చేయగలిగే చిప్‌ను అభివృద్ధి చేసినట్టు ఆయన వెల్లడించారు.
ఇటీవల కాలంలో యాపిల్ మరియు ట్విట్టర్ కు మధ్య మాటల వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంలో ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మాట మార్చారు. టెక్ దిగ్గజం యాపిల్ పై యుద్ధాన్ని ప్రకటించిన ఆయన తాజాగా వెనక్కు తగ్గారు.
ఒక సమాచారాన్ని షాట్ అండ్ స్వీట్ గా ప్రజలకు తెలియజేసే సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో దిగ్గజ సంస్థగా ట్విట్టర్ కు మంచి పాప్యులారిటీ ఉంది. అలాంటి ట్విట్టర్లో ఒక ట్వీట్ లో 280 క్యారెక్టర్ల వరకు టైప్ చేసే వెసులుబాటు ఉంది. కాగా ఈ పరిమితిని 420కు పెంచే అవకాశం ఉంది.
మరోసారి మస్క్ నెట్టింట వైరల్ గా మారారు. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలైన యాపిల్, గూగుల్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు మస్క్. ఈ రెండు కంపెనీలు తమ యాప్ స్టోర్ల నుంచి ట్విటర్‌ను తొలిగిస్తే గనుక యాపిల్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు పోటీగా తాను ప్రత్యామ్నాయంగా మొబైల్స్ తయారీలోకి ప్రవేశిస్తానని అన్నారు.
ట్విట్టర్ కంపెనీల కోసం "గోల్డ్ చెక్", ప్రభుత్వ ఖాతాలకు బూడిద రంగు మరియు వ్యక్తుల కోసం నీలం రంగును ప్రవేశపెడుతుందని మస్క్ చెప్పారు.
ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థలో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మస్క్ ట్విట్టర్ కు బాస్ అయిన వెంటనే సంస్థలోని సగానికి పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపిన సంగతి తెలిసిందే. కాగా మస్క్ చర్యను వ్యతిరేకిస్తూ ఏకంగా 1,200 మంది ఉద్యోగులు ట్విట్టర్ కు రాజీనామా చేశారు.
ట్విట్టర్లోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ ఇచ్చారు. జీవితకాల నిషేధానికి గురైన ట్రంప్ ఖాతాను ట్విట్టర్ నూతన అధినేత ఎలాన్ మస్క్ పునరుద్ధరించారు.