ఎలాన్ మస్క్: నన్నంటే ఓకే కానీ నా ఫ్యామిలీ జోలికొస్తే బాగోదు అంటున్న ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్.. ఎందుకంటే..?
తాజాగా గురువారం నాడు ఈ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ ఫాం అయిన ట్విట్టర్ పలువురు జర్నలిస్టుల ఖాతాలను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు మస్క్.

Elon Musk Twitter: ట్విట్టర్ ను టేకప్ చేసుకున్న దగ్గరి నుంచి ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఎన్నో మార్పులు చేర్పులు చేపట్టి అనేక వివాదాలను మరియు విమర్శలను ఎదుర్కొంటున్నారు. కాగా తాజాగా గురువారం నాడు ఈ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ ఫాం అయిన ట్విట్టర్ పలువురు జర్నలిస్టుల ఖాతాలను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. వాటిలో అమెరికాలోని ప్రధాన పత్రికలైన న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్‌కు చెందిన జర్నలిస్టులు కూడా ఉన్నారు. అయితే, ఇలా వారి ఖాతాలను సస్పెండ్ చెయ్యడానికి గల కారణాన్ని మాత్రం ట్విటర్ వెల్లడించలేదు.
ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో ఎలాన్ మస్క్ తో పాటు ట్విట్టర్ లో చేస్తున్న మార్పులపై వీరు ప్రత్యేక వార్తలు రాయడం వల్లే ఇలా సస్పెండ్ చేసి ఉండొచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు. దీనిపై ట్విటర్ వేదిక మస్క్ స్పందించారు. ‘‘అందరికీ వర్తించే డాక్సింగ్ (doxxing) నిబంధనలే జర్నలిస్టులకూ వర్తిస్తాయి. “రోజూ నన్ను విమర్శించడం వరకు పర్వాలేదు కానీ నా కుటుంబానికి ముప్పు తెచ్చేవిధంగా మాట్లాడడం ఏ మాత్రం సరికాదు’’ అని మస్క్ ట్వీట్ చేశారు. ట్విట్టర్ యూజర్ల వ్యక్తిగత వివరాలను పంచుకోవడాన్ని నిషేధిస్తూ ట్విటర్ నిబంధనలు రూపొందించింది. వీటినే డాక్సింగ్ రూల్స్‌గా అంటారు. ఈ ఖాతాలపై వారం రోజుల వరకు సస్పెన్షన్ కొనసాగుతుందన్నారు. కానీ దీనిపై ఇప్పటి వరకు ట్విట్టర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
Criticizing me all day long is totally fine, but doxxing my real-time location and endangering my family is not
— Elon Musk (@elonmusk) December 16, 2022
మస్క్ ప్రైవేట్ జెట్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్న ‘ఎలాన్‌జెట్’ పేరిట ఉన్న ఖాతాను కూడా ట్విట్టర్ సస్పెండ్ చేసింది. ఇక ఈ విషయాలపై న్యూయార్క్ టైమ్స్ స్పందించింది. ‘ప్రముఖ జర్నలిస్టుల ట్విటర్ ఖాతాలను సస్పెండ్ చేయడం దురదృష్టకరమని అలా చెయ్యడానికి గల కారణమేంటో కూడా ట్విటర్ తెలియజేయకపోవడం గమనార్హం అంటూ సస్పెన్షన్‌కు గురైన జర్నలిస్టుల ఖాతాలన్నింటినీ పునరుద్ధరించాలని తెలిపింది.

elon musk Twitter
ప్రతి వ్యక్తికి స్వేచ్ఛగా మాట్లాడే స్వాంతంత్య్రం ఉందని.. వాక్ స్వాతంత్య్రానికి ట్విట్టర్ వేదికని పలు దానిని రక్షించడానికే తాను ట్విటర్‌ను కొనుగోలు చేశానని పలు సందర్భాల్లో మస్క్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ తరుణంలోనే ఆయనపై విమర్శలు చేసిన పలువురు జర్నలిస్టుల ఖాతాలను తాజాగా సస్పెండ్ చేయడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు ఇంటిపోరు… పన్నుల పెంపును వ్యతిరేకించిన ఎంపీలు