Home / Diwali 2022
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరియు ప్రథమ మహిళ జిల్ బైడెన్ సోమవారం వైట్ హౌస్‌లో దీపావళి రిసెప్షన్‌ను నిర్వహించారు.
ఏపీ పోలీసుల తీరు ఏ విధంగా సమర్ధనీయంగా ఉండడం లేదు. తాజాగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొన్న చందంగా విజయవాడ దీపావళి టపాకాయలు అమ్మే వ్యాపారులపై పోలీసులు పడ్డారు. సాయంత్రం 6 దాటింది ఇకపై టపాసులు అమ్మేందుకు వీలులేదని ఆంక్షలు విధించారు.
దీపావళి పండుగ గదా...మన పార్టీ ప్రజా ప్రతినిధులకు ఓ గిఫ్ట్ ఇవ్వాలని భావించాడు ఆ మంత్రి...ఇంకేముంది అమల్లో పెట్టేశాడు..చివరకి సోషల్ మీడియాలో చిక్కుకొని గిల గిల కొట్టుకున్న ఆ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకొనింది. అది కాస్తా వివాదానికి దారితీసింది.
తెదేపా జాతీయ అధ్యక్షుడు తెలుగ రాష్ట్రాల ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఆహ్వానించే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవి మీ ఇంటిల్లిపాదినీ సకల శుభాలతో అనుగ్రహించాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశవ్యాప్తంగా చిన్నాపెద్ద ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటారని ఆయన అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియచేశారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్నానంపై జ్నానం, దుష్ట శక్తులపై దైవశక్తి, సాధించిన విజయాలకు ప్రతీకే దీపావళిగా ఆయన తెలిపారు.
ప్రతి సంవత్సరం కార్తీక కృష్ణ పక్షం చతుర్దశినాడు జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది దీపావళి మరియు నరక చతుర్దశి పండుగలు రెండూ ఒకే రోజు వచ్చాయి. మరి ఈ రోజు కొన్ని చేయకూడని పనులు కూడా చేస్తూ అనేక సమస్యలను తెచ్చుకుంటున్నారు. మరి అలా చెయ్యకూడని పనులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దీపావళి వేడుకల కోసం ఆయోద్య ముస్తాబైంది. ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యలో దీపావళి వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు.
ఒక్కో పండుగకు ఒక్కో విశిష్టత ఉంటుంది. దానికి తగినట్టుగానే వస్త్రధారణ, అలంకరణ, వంటకాలు ఉంటాయి. సంక్రాంతికి అరిసెలు, అట్లతద్దికి అట్లు ఎలాగైతే ఆనవాయితీగా వస్తున్నాయో అలానే దీపావళికి కంద దుంపతో వండిన వంటకాలు తినాలనే ఆచారం ఉంది. ఇలా దీపావళి రోజున కంద తినడం వల్ల సంపద కలిసొస్తుందని నమ్మకం.
ఢిల్లీవాసులకు ఈ ఏడాది కూడా దీపావళి పండుగ నాడు టపాకాయలు కాల్చేందుకు వీలు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో టపాకాయల నిషేదాన్ని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది.