Home / Daggubati Purandeswari
రాష్ట్రంలోని మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె జగన్ సర్కారు పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏపీ సర్కారు మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లు బహిర్గతం చేయాలన్నారు.
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయడును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను టీడీపీ నాయకులతో పాటు పలువురు విపక్ష నేతలు ఖండిస్తున్నారు.
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరిగారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వరుస ప్రెస్ మీట్లలో జగన్ ప్రభుత్వ వైఫల్యంపై ఆమె గళం విప్పుతూనే ఉన్నారు. ఈ మేరకు తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం లెక్కకు మిక్కిలిగా అప్పులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు తాజాగా విజయవాడ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె తన ఛాంబర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందించి.. అభినందనలు తెలియజేశారు.
బీజేపీ జాతీయప్రధానకార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. గత నెలలో ఒరిస్సా బాధ్యతల నుంచి తప్పించగా నిన్న ఛత్తీస్ ఘడ్ బిజేపి ఇంచార్జ్ బాధ్యతల నుంచి పురందేశ్వరిని తప్పించింది.