Home / chegondi harirama jogaiah
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖ విడుదల చేశారు.బుధవారం జనసేన పార్టీ 50 నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తే బాగుంటుందనేది ఆయన తన లేఖ ద్వారా తెలియేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో 10 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను హరిరామ జోగయ్య విడుదల చేశారు.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో సీనియర్ నేత మాజీ హోమ్ శాఖ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేగొండి హరిరామజోగయ్య సమావేశమయ్యారు. వర్తమాన రాజకీయ అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని శ్రీ హరిరామజోగయ్య అభిలషించారు.
ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపుల విరోధి అని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. వైసిపి సర్కార్ కాపు వ్యతిరేక విధానం చూస్తుంటే కాపులకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి ఏమాత్రం సిద్ధంగా లేదని అర్థమైపోతోందని జోగయ్య చెప్పారు.
జనసేన తరపున 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య వెల్లడించారు. సుమారు 70 నియోజకవర్గాలలో జనసేన పార్టీ తరపున ఆర్థికంగా, పలుకుబడి పరంగా, సామాజిక పరంగా బలమైన అభ్యర్థులను గుర్తించే దిశగా జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరిలో రెండురోజులపాటు కసరత్తు చేశారని జోగయ్య వివరించారు.
జనసేన -టీడీపీ కూటమి మేనిఫెస్టో ఓట్లని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. అయితే ఈ రెండు పార్టీలు ఇచ్చే హామీలు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉంటే ఓటర్లని ఆకట్టుకుంటాయి.? ఏ ఆకర్షణతో ఉంటే వైఎస్ఆర్ పార్టీ అనుసరిస్తున్న సంక్షేమానికి మించి మంచి సంక్షేమాన్ని అంద జేస్తాయి అన్నదే కీలక అంశంగా నిలుస్తుందని జోగయ్య సూచించారు.
రాబోయే పదేళ్ళలో రాబోయే ప్రభుత్వం ఏ లక్ష్యాన్ని నిర్ధారించగలగాలో, ప్రజల అభీష్టమేమిటో అర్థం చేసుకుని పీపుల్స్ మేనిఫెస్టోని నవంబర్ 1వ తేదీకల్లా తయారు చేస్తామని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేబట్టబోతుందనే విషయంపై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామజోగయ్య సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి వేణుగోపాల కృష్ణ ఈ ప్రకటన చేయడం పట్ల కాపు సంక్షేమ సేన స్వాగతించిందని జోగయ్య తెలిపారు.
టీటీడీ చైర్మన్ పదవి రాయలసీమలో 20 లక్షలు జనాభా ఉన్న బలిజలకు ఇవ్వాలని హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మరోలేఖ రాశారు. ఇప్పటికే పలు అంశాలను లేఖల ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ఇప్పుడు టీటీడీ చైర్మన్ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ఏపీలో రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. రాబోయే ఎన్నికలే ధ్యేయంగా అధికార, ప్రతిపక్ష పార్టీల యాత్రలు, సభలు, సమావేశాల వేదికగా విమర్శలు.. మాటల యుద్ధాలకు తెరలేపుతూ ఎవరి పంథాలో వారు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య
తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభమయిన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అదిరిపోయిందని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. బస్సు యాత్ర మొదలయి, పూర్తయే నాటికి జనసేన గ్రాఫ్ మరింత పెరిగి ఒంటరిగా ఎన్నికలలో ప్రయాణం చేసినా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమని తాను ఎప్పుడో చెప్పానని జోగయ్య గుర్తు చేశారు.