Last Updated:

Harirama Jogaiah: జనసేన తరపున 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులు.. చేగొండి హరిరామ జోగయ్య

జనసేన తరపున 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య వెల్లడించారు. సుమారు 70 నియోజకవర్గాలలో జనసేన పార్టీ తరపున ఆర్థికంగా, పలుకుబడి పరంగా, సామాజిక పరంగా బలమైన అభ్యర్థులను గుర్తించే దిశగా జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరిలో రెండురోజులపాటు కసరత్తు చేశారని జోగయ్య వివరించారు.

Harirama Jogaiah: జనసేన తరపున 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులు..  చేగొండి హరిరామ జోగయ్య

Harirama Jogaiah: జనసేన తరపున 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య వెల్లడించారు. సుమారు 70 నియోజకవర్గాలలో జనసేన పార్టీ తరపున ఆర్థికంగా, పలుకుబడి పరంగా, సామాజిక పరంగా బలమైన అభ్యర్థులను గుర్తించే దిశగా జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరిలో రెండురోజులపాటు కసరత్తు చేశారని జోగయ్య వివరించారు. ఈ మేరకు ఒక లేఖని జోగయ్య విడుదల చేశారు.

జన సైనికులందరు ఆశిస్తున్నట్లుగా తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల పంపిణీ, పదవుల పంపిణీ విషయంలో జనసేన వెనుకబడిపోతున్నదేమో అనే సందేహాన్ని మిగులుస్తూ ఈ మధ్య కాలంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగిన మాట వాస్తవమేనని జోగయ్య అన్నారు. అయితే మనం భయపడ్తున్నట్లుగా పొత్తు ధర్మంలో భాగంగా మన సంకల్పానికి భిన్నంగా ఉభయుల మధ్య అంగీకారాలు జరిగినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని జోగయ్య తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఎటువంటి నిర్ణయాలు జరగలేదనే చెప్పాలని జోగయ్య తేల్చి చెప్పారు.

పవన్ కళ్యాణ్‌కి పదవి..(Harirama Jogaiah)

జనసేన- తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అధికార పంపిణీ విషయంలో కూడా పవన్ కళ్యాణ్- చంద్రబాబు మధ్య ఎలాంటి నిర్ణయాలు జరగలేదని తెలిసిందని జోగయ్య స్పష్టం చేశారు. జన సేనాని పవన్ కళ్యాణ్‌కి గౌరవప్రదమైన హోదాతో పదవి దక్కుతుందని, దానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని జోగయ్య అన్నారు. ఈ నిర్ణయానికి సంబంధించి పరిస్థితి ఇంకా చేయి దాట లేదని, రెండు పార్టీల మధ్య ఓట్లు సజావుగా ట్రాన్స్‌ఫర్ అయ్యే దిశగానే నిర్ణయాలు జరుగుతాయని జోగయ్య ధీమా వ్యక్తం చేశారు. మనం కోరుకొనే నిర్ణయాలు తీసుకునేలా వారిద్దరికీ తగిన సమయం మనం ఇవ్వాలని, సహనంతో ఉండాలని జోగయ్య జనసైనికులని కోరారు.