Home / central govt
షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) వర్గీకరణకు కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో సెక్రటరీల కమిటీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేసింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు, మాదిగలు వంటి షెడ్యూల్డ్ కులాలు మరియు ఇతర సమూహాల ప్రయోజనాలను పరిరక్షించడానికి తీసుకోగల పరిపాలనా చర్యలను పరిశీలించడానికి క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేశారు.
ధర భారీగా పెరిగినా సిగరెట్ల వాడకం తగ్గలేదని పార్లమెంటరీ స్థాయీ సంఘమే స్వయంగా వెల్లడించింది. ధర పెరగితేనేం పెట్టె కొనే చోట.. అరపెట్టే కొంటాం లేదా ఒక్క సిగరెట్ కొంటాం కానీ ఊదడం మాత్రం మానవు అంటున్నారు పొగరాయుళ్లు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో మరికొన్ని సినిమా థియేటర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు పలు గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్లని నిర్మించేందుకు ప్రభుత్వ రంగ సీఎస్‌సీ ఈ- గవర్నెన్స్ సర్వీసెస్ నిర్ణయించింది. అక్టోబర్ సినిమాతో కలిసి 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో మరో 10,000 సినిమా హాళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపింది.
రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రేషన్ కార్డులను కేంద్రం ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో సుమారు 10 లక్షల మంది ప్రజలు అక్రమంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ మేరకు వారందరీ రేషన్ కార్డులను రద్దు చేసేందుకు జాబితాను సిద్ధం చేసింది.