Home / BJP
బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్ అవినీతికి పాల్పడితే మోదీ అండగా నిలబడ్డారని చెప్పారు. ఆదివారం ఆందోల్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుండి మూడు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు కామారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సమర శంఖం పూరిస్తున్నాయి. ఈ క్రమంలోనే జోరుగా నామినేషన్ల ప్రక్రియ జరుగుతుండగా.. మరోవైపు కొన్ని పార్టీలు పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించకపోవడం గమనార్హం. అయితే నేటితో నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఇక అభ్యర్ధుల లాస్ట్ లిస్ట్ భారతీయ జనతా పార్టీ తాజాగా ప్రకటించింది.
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపు అందుకోవాలని భావిస్తున్నారు. అందుకు గాను అలుపెరగని యోధుడిలా వరుస సభల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ క్రమంలోనే నేడు గజ్వేల్, కామారెడ్డి లలో నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా గజ్వేల్ లో నామినేషన్ దాఖలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. తాజాగా బీజేపీ అధిష్టానం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ.. గురువారం మధ్యాహ్నం 35మందితో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లను కేటాయించింది.
అందరూ ఊహించినట్లుగానే బీజేపీ నేత,మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ గూటికి చేరారు. తెలంగాణ బిజెపికి షాకిచ్చారు. వివేక్‌తోపాటు ఆయన కుమారుడు వంశీ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసారు. ఈ మేరకు ఆయన పార్టీకి తన రాజీనామా లేఖను పంపించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. కొద్దినెలల కిందట కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేసి ఆయన ఓడిపోయిన విషయం తెలిసిందే.
సీనియర్ నటి గౌతమి బీజేపీని వీడారు.తన ఆస్తులను దోచుకున్న వ్యక్తికి పార్టీ సీనియర్ సభ్యులు సహాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను గత 25 సంవత్సరాలుగా బీజేపీలో సభ్యురాలిగా ఉంటూ చిత్తశుద్ధితో పనిచేశానని చెప్పారు.
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. కాగా నిన్ననే తెలంగాణలో ఎన్నికలకు నగారా మోగింది. ఈ క్రమంలో తెలంగాణలో చేపట్టాలని సన్నాహాలు చేస్తున్న బీజేపీ.. ఆ దిశగా తెలంగాణలో ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగా బీజేపీ సీనియర్ నేతలు వరుస పర్యటనలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరారు. భాజపా నేత డికె అరుణ సమక్షంలో చికోటి ప్రవీణ్ పార్టీలో చేరగా.. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆయనకు కండువా కప్పారు. గత కొంత కాలంగా ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రవీణ్ జాయిన్ కావడాన్ని పార్టీలో ఒక వర్గం వ్యతిరేకించింది.