Home / BJP
బీజేపీతో పొత్తుకు టీడీపీ తహతహలాడుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పూర్తిగా నమ్మకం కోల్పోయిన టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ఆలోచన..చంద్రబాబు ఎప్పుడూ చేయలేదని పొత్తు లేని చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు తాను బీజేపీలోనే ఉంటానన్నారు. ఒకవేళ బీజేపీ తనపై సస్పెన్షన్ ఎత్తివేయకపోతే తాను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. తాను హిందువాదినని రాజాసింగ్ తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణలో పర్యటన చేయనున్న విషయం తెలిసిందే. ఆగస్టు 27న రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా పేరిట నిర్వహించే సభలో అమిత్ షా హాజరు కానున్నారు. అలానే ఈయన సమక్షంలో పలువురు నేతలు కాషాయ కండువాలు కప్పుకొని బీజేపీలో చేరనున్నారు.
మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. 2021 జనవరి 18న బీజేపీలో చేరిన చంద్రశేఖర్.. పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ పంపారు. కేంద్ర ప్రభుత్వం అన్నీ తెలిసి కూడా తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలకడం ప్రజాకంఠకంగా మారడంతో తప్పనిసరై రాజీనామా చేస్తున్నానని చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నారు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్లో బండి ప్రత్యేక పూజలు చేశారు. తనను నమ్మి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ కేంద్రమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.
సినీ నటి జయసుధ బుధవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ ఛుగ్, రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ పార్టీ సభ్యత్వం అందించి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌ని నియమించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో 13 మంది ఉపాధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులు, 13మంది కార్యదర్శులకి చోటు కల్పించారు. గద్వాలకి చెందిన డికె అరుణని ఉపాధ్యక్షురాలిగా కొనసాగించారు. ఏపీకి చెందిన సత్యకుమార్కి కార్యదర్శిగా చోటు దక్కింది.
ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా ఫోటో ఇంటర్నెట్లో మారింది మరియు అది రాజకీయ నాయకుడిపై కాకి దాడి చేసిన సంఘటన కెమెరాలో చిక్కుకుని వైరల్ కావడంతో, బీజేపీ (ఢిల్లీ) ఆయనను ట్రోల్ చేసేందుకు ట్విట్టర్లో షేర్ చేసింది. అబద్ధం చెబితే కాకి కాటు వేస్తుందన్న ప్రముఖ హిందీ సామెత 'ఝూత్ బోలే, కౌవా కాటే' అంటూ ఆ ట్వీట్‌కు పార్టీ క్యాప్షన్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు తాజాగా విజయవాడ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె తన ఛాంబర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందించి.. అభినందనలు తెలియజేశారు.
ప్రస్తుతం రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా రాజ్యసభకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ వార్త పూర్తి వివరాల్లోకి వెళ్తే..