Home / Bharath Jodo Yatra
కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర విశేష జనాదరణ పొందుతుంది. తెలంగాణలో 5వ రోజు భారత్ జోడో యాత్ర నిర్విఘ్నంగా జరిగింది. జడ్చర్ల నుంచి పాదయాత్ర ద్వారా షాద్ నగర్ చేరుకున్న రాహుల్ అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ నాలుగో రోజు భారత్ జోడో యాత్రను శనివారం ఉదయం ధర్మాపూర్ నుంచి ప్రారంభించారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోడో యాత్ర.. నేడు తెలంగాణలోకి ప్రవేశించింది. రాహుల్ గాంధీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో . కర్ణాటక సరిహద్దులో ఉన్న గూడబెల్లూరులో ఎంట్రీ ఇవ్వడంతో తెలంగాణలో జోడో యాత్ర ప్రారంభమయింది.
ఏపీకి ఒకటే రాజధాని.. అదే అమరావతి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.
భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల్లో విషపు మొక్కలు నాటుతోందని తెలంగాణ ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. ఏపీలో రెండో రోజు కొనసాగుతున్న భారత జోడో యాత్రలో భాగంగా ఆమె ఆదోని మండలంలో రాహుల్ తో కలసి పాదయాత్రలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు అమరావతే రాజధానిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కుదిరితే అమరావతి రైతుల పాదయాత్రలో తాను కూడా పాల్గొంటానన్నారు
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 37వ రోజుకి చేరింది. నేడు ఏపీలోకి ఈ యాత్ర ప్రవేశించింది. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా రాంపురాలో నేడు మొదలైన రాహుల్ పాదయాత్ర ఉదయం 10 గంటలకు ఏపీలోని అనంతపురం జిల్లా జాజిరకల్లు టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది.