Home / bbc
విదేశీ నిధుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం బీబీసీపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. ఈడీ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల ప్రకారం కొంతమంది కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ల స్టేట్మెంట్ల రికార్డింగ్‌ను కూడా కోరింది.
ఎలాన్ మస్క్‌కు చెందిన ట్విట్టర్ తాజాగా బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్ బీబీసీకి ప్రభుత్వం ఫండింగ్ సమకూరుస్తోందని తన ప్రొఫైల్ పేజీలో వివరించింది. ఈ ట్వీట్ వెల్లడైన వెనువెంటనే ట్విట్టర్ లేబుల్‌పై బీబీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మస్క్‌కు గట్టిగానే జవాబిచ్చింది. ప్రజలకు సేవ చేస్తున్నందుకు వారి నుంచి లైసెన్సు రుసుము తీసుకుని మీడియా సంస్థను నడిపిస్తున్నామని వివరణ ఇచ్చింది.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నాడు. ఫిల్మ్ కెరీర్ పరంగా బ్రహ్మస్త్ర సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ హీరో.. పర్సనల్ లైఫ్ లోనూ తండ్రిగా హ్యాప్పీగా ఉన్నాడు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేస్తున్న మూవీ ‘యానిమల్’.
ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్ల వెనుక.. ఆయన హస్తం ఉందంటూ బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.
ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ బీబీసీ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ దాడులు మూడో రోజూ కొనసాగుతున్నాయి. బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ పన్ను ఎగవేతకు పాల్పడుతోందన్న అనుమానంతో ఢిల్లీ, ముంబై లోని సంస్థ కార్యాలయాల్లో సర్వే పేరుతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ బీబీసీ కార్యాలయంలో రెండో రోజు ఐటీ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. పన్నుల అవకతవకల ఆరోపణలపై ఢిల్లీ, ముంబైలోని సంస్థ కార్యాలయాల్లో ఈ సర్వే జరుగుతోంది.
బీబీసీ ఇండియా కార్యాలయంపై ఐటీ దాడులు జరగడంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. గోద్రా ఘటనకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాలకే.. ఆ సంస్థ పై ఐటీ దాడులు జరగడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.
IT raids on BBC: దిల్లీలోని ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయంపై ఐటీ అధికారులు సర్వే నిర్వహించారు. దిల్లీ, ముంబయిలోని సంస్థ కార్యాలయాల్లో సర్వే నిర్వహించారు. దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ అధికారులు ప్రత్యక్షమయ్యారు. ఈ మేరకు పన్నుల అవకతవకల ఆరోపణలపై సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులోని సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.