Home / BalasoreTrainAccident
బాలాసోర్ రైలు ప్రమాదఘటన నేపధ్యంలో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలయింది. రైల్వే వ్యవస్థలో ప్రస్తుత ప్రమాదం మరియు భద్రతా పరామితులను విశ్లేషించడానికి మరియు సమీక్షించడానికి మరియు క్రమబద్ధమైన భద్రతను సూచించడానికి సాంకేతిక సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిషన్ను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టులో పిఐఎల్ ప్రభుత్వం నుండి ఆదేశాలను కోరింది.
Odisha Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి విధితమే. రక్తపు మరకలు, మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా మృత్యుఘోష ఆవరించి ఉంది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 290 మంది దుర్మరణం చెందినట్టు అధికారులు వెల్లడించారు.
ఒడిశాలో జరిగిన మహా విషాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతిని గురి చేసింది. ఇండియన్ రైల్వే చరిత్రలో అతి ఘోర ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిందీ ఈ సంఘటన. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 278 మంది మృతి చెందారు. 900 మందికి పైగా గాయపడ్డారు.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు, సన్నిహితులకు ఉక్రెయిన్ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బోగీల నుంచి మృతదేహాల వెలికితీత ఇంకా కొనసాగుతోంది. ఘటనా స్థలి వద్ద ఎన్డీఆర్ఎఫ్ తో సహా భారత ఆర్మీ కూడా సహాయ చర్యల్లో పాల్గొంటోంది.
ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే. బోగీల నుంచి మృతదేహాల వెలికితీత ఇంకా కొనసాగుతోంది. ఘటనా స్థలి వద్ద ఎన్డీఆర్ఎఫ్ తో సహా భారత ఆర్మీ కూడా సహాయ చర్యల్లో పాల్గొంటోంది.