Home / Balasore
ప్రశాంతంగా ఉన్న ఒడిషాలో మత ఘర్షణలు చెలరేగాయి. స్థానికంగా వచ్చే నీరు కాస్తా ఎర్రగా మారడంతో బక్రీద్ సందర్భంగా గో హత్య జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో 297 మంది ప్రాణాలను బలిగొన్న రైలు ప్రమాదం జరిగిన నాలుగు నెలల తర్వాత కూడా 28 మృతదేహాలు మిగిలిపోయాయి. వీటిని ఎవరూ గుర్తు పట్టకపోవడం, క్లెయిమ్ చేయకపోవడంతో, భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ ( బీఎంసీ ) అధికారులు ఈ మృతదేహాలను తొలగించే ప్రక్రియను ప్రారంభించినట్లు ఒక అధికారి తెలిపారు.
బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం సందర్బంగా గుర్తుతెలియని మృతదేహాలను వెలికితీసినపుడు తాత్కాలికంగా అక్కడ సమీపంలో ఉన్న బహనాగ నోడల్ పాఠశాలలో వీటిని ఉంచారు. అయితే వేసవి సెలవుల అనంతరం విద్యార్దులు, సిబ్బంది తిరిగి స్కూళ్లను తెరిచాక అక్కడ ఉండటానికి నిరాకరించడంతో దానిని కూల్చేసారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గత శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు చేయడానికి ఒక బృందం మంగళవారం ప్రమాద స్థలానికి చేరుకుంది.మానవ తప్పిదాలు లేదా ప్రమాదానికి కారణమయ్యే ఉద్దేశపూర్వక ప్రయత్నాలతో సహా అన్ని కారణాలను పరిశీలిస్తుంది.
గత వారం శుక్రవారం బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించి బాలాసోర్ ప్రభుత్వ రైల్వే పోలీస్ (జిఆర్పి) స్టేషన్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదైంది. భారతీయ శిక్షాస్మృతిలోని 337, 338, 304A (నాన్-బెయిలబుల్) & 34 కింద కేసు నమోదు చేయబడింది, ఇందులో "నిర్లక్ష్యం వల్ల సంభవించిన మరణాలు" మరియు రైల్వే చట్టంలోని 153, 154 & 175 అభియోగాలు ఉన్నాయి.