Home / Assembly sessions
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆందోళనలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే. ఆందోళనలకు సంబంధించి సమాచారం అందితే ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులకు సమాచారం ఇస్తుంటారు.
తెలంగాణ ప్రభుత్వం నేడు శాసన సభలో ఎనిమిది బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది.
కేంద్రం మాదిరిగా సంపదను మిత్రులకు కాదు పేదలకు పంచిపెడుతున్నామని గుర్తించుకోవాలని తెలంగాణ మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అసెంబ్లీలో ప్రసంగించారు.
సుదీర్ఘ చరిత్ర కల్గిన తెలంగాణ ఆర్టీసిని అమ్మాలని క్రేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పదే పదే లేఖలు వ్రాస్తుందని అసెంబ్లీలో సిఎం కేసిఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. ఐదురోజుల విరామం తర్వాత ఇవాళ తిరిగి ఉభయసభలు ప్రారంభం అయ్యాయి. ముందుగా దివంగత మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు మృతికి సభలో సంతాపం తెలిపారు.
ఈ నెల 15 నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం జరిగింది. సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలు, పద్దులపై చర్చించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు, చీఫ్‌విప్, కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.
తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. శాసనసభ ఎనిమిదో సెషన్‌కు సంబంధించి మూడో సమావేశం ప్రారంభం కానుంది. మండలి 18వ సెషన్‌కు సంబంధించిన మూడో సమావేశం ప్రారంభం కానుంది. సమావేశాల నిర్వహణ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అటు శాసన మండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభం అవుతాయని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు.