Telangana Assembly: ప్రారంభమయిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. ఐదురోజుల విరామం తర్వాత ఇవాళ తిరిగి ఉభయసభలు ప్రారంభం అయ్యాయి. ముందుగా దివంగత మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు మృతికి సభలో సంతాపం తెలిపారు.
Hyderabad: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. ఐదురోజుల విరామం తర్వాత ఇవాళ తిరిగి ఉభయసభలు ప్రారంభం అయ్యాయి. ముందుగా దివంగత మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు మృతికి సభలో సంతాపం తెలిపారు. అనంతరం కేంద్ర విద్యుత్, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుతో పాటు పలు బిల్లులు సభలో ప్రవేశపెడుతున్నారు మంత్రులు. ఇక రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో మొత్తం ఏడు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.
తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రవేశపట్టారు. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ, తెలంగాణ మున్సిపల్ లాస్ చట్ట సవరణ బిల్లును మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్ బిల్లును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశపెట్టగా, తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బిల్లును విద్యా శాఖ మంత్రి సబిత పెట్టారు.
తెలంగాణ మోటర్ వెహికిల్స్ టాక్సేషన్ బిల్లును ట్రాన్స్ పోర్ట్ మంత్రి పువ్వాడ అజయ్ ప్రవేశపెట్టగా, వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సవరణ బిల్లును ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టారు. ఈ బిల్లులపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది.