Home / arrest
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం (ఆగస్టు 24) జార్జియాలో 2020 ఎన్నికలను తారుమారు చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై లొంగిపోయారు, 20 నిమిషాల అనంతరం మగ్ షాట్ ( ఫోటో) తరువాత ట్రంప్ 200,000 డాలర్ల బాండ్‌పై విడుదల చేయబడ్డారు. అనంతరం అతను న్యూజెర్సీకి తిరిగి వచ్చే విమానం కోసం విమానాశ్రయానికి తిరిగి వెళ్ళాడు.
హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలో ఖాప్ 'మహాపంచాయత్' ముగిసింది. రైతు సంఘాల నాయకుడు రాకేష్ తికాయత్ కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారు. డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ మరియు భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని కోరారు.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబయి యూనిట్ మాజీ చీఫ్ సమీర్ వాంఖడే ను జూన్ 8 వరకు అరెస్ట్ చేయవద్దని బాంబే హైకోర్టు ఆదేశించింది.వాంఖడేకు ఉపశమనం కల్పించే ముందు హైకోర్టు కొన్ని షరతులు విధించింది.
తాను అవినీతికి పాల్పడినట్లు రుజువైతే సీబీఐకి దమ్ముంటే అరెస్టు చేయాలని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ శుక్రవారం సవాల్ చేసారు. స్కూల్ ఉద్యోగాల కుంభకోణంపై విచారణలో భాగంగా శనివారం కోల్‌కతా కార్యాలయంలో హాజరుకావాలని సీబీఐ పిలుపునిచ్చిన నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
థాయ్‌లాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్ అయ్యాడు. పటాయాలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ చికోటి ప్రవీణ్ పట్టుబడ్డాడు. థాయ్‌లాండ్ పోలీసుల అదుపులో చికోటి, మాధవ్‌రెడ్డి, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి ఉన్నారు.
Akhila Priya: నంద్యాలలో రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి అఖిల ప్రియ చేసిన ఆరోపణలు రాజకీయాల్లో వేడిని పెంచాయి. బహిరంగ కు చర్చకు రావాలంటూ.. ఎమ్మెల్యే శిల్పా రవికి భూమ అఖిల ప్రియ సవాల్ విసిరారు. దీంతో అఖిల ప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై తెదేపా నిరసన వ్యక్తం చేసింది.
ఏపీ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతుంది. అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. రెండేళ్ల నుండి నిరుద్యోగులను మోసం చేస్తున్న ఇద్దరి కానిస్టేబుల్స్ అరెస్ట్ తో అసలు బండారం బయటపడింది.
కడప నగరంలో సంచలన సృష్టించిన సెల్ ఫోన్ల కంటైనర్ దొంగతనం కేసును పోలీసులు ఛేధించారు. ఈ కేసులో కోట్ల రూపాయల విలువచేసే సెల్ ఫోన్లను రికవరీ చేశారు. అంతరాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్ట చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. దీనిలో భాగంగా హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే అభిషేక్ రావు నివాసంలో ఈడీ, సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
పాకిస్తాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ చైర్మన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించాలని చూస్తోంది .