Sandhya Theatre: సంధ్య థియేటర్ ఘటన – ముగ్గురి అరెస్ట్
Sandhya Theatre Incident: ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. డిసెంబర్ 5ను అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ రిలీజైంది. దానికి ముందు రోజు డిసెంబర్ 4న ప్రీమియర్స్ వేయడంతో సినిమా చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు. అదే సమయంలో థియేటర్ హీరో అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి వచ్చాడు.
ఈ క్రమంలో తమ అభిమాన హీరోని చూసేందుకు అభిమానులు ఎగబడటంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న రేవతి తొక్కిసలాట కిందపడి ప్రాణాలు కొల్పోయింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ టీంపై కేసు నమోదు చేశారు. సరైన భద్రత చర్యలు చేపట్టకపోవడం వల్లే రేవతి మరణించిందనే ఆరోపణలపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇందులో సంధ్య థియేటర్ యజమాని, సెక్యూరిటీ మేనేజర్‌తో పాటు మరోకరిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే సంధ్య థియేటర్ ఘటనపై వెంటనే పుష్ప 2 టీం స్పందించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ రేవతి కుటుంబానికి నష్టపరిహారాన్ని ప్రకటించారు. అలాగే పుష్ప 2 సక్సెస్ మీట్‌లోనూ అల్లు అర్జున్ స్పందించారు. ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనతరం ఆమె కుటుంబానికి తానేప్పుడు అండగా ఉంటానని, ఈ మేరకు రేవతి కుటుంబానికి రూ. 25 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించాడు.