Home / Ap latest news
అమరావతి రైతులు తాము చేస్తున్న పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. .పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా అమరావతి జేఏసీ ప్రకటించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇష్టం ఉన్నవాళ్లు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది.
ఆంధ్రప్రదేశ్ కు సిత్రాంగ్ ముప్పు పొంచి ఉంది. ఈ తరుణంలో తీరప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో గత కొద్దికాలంగా నిషేధిత భూములకు సంబంధించి ఆ ప్రాంత ప్రజల పోరాటాలు చేస్తున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వానికి అనేక సార్లు వినతులు సమర్పించారు. కాగా ఎట్టకేలకు ప్రజల గోడు విన్న సీఎం జగన్ వారికి శుభవార్త చెప్పారు. నేడు ఆయన అవనిగడ్డలో పర్యటిస్తున్నారు.
ఏపీలో ఓ ఆర్టీసి డ్రైవర్ అమానుషంగా ప్రవర్తించాడు. నడిరోడ్డుపై బస్సును ఆపి పరారైనాడు.
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకనందా రెడ్డి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం ఓకే చేసింది
విశాఖలో పవన్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించిన తీరు చాలా దారుణమని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నేను పవన్ తో మాట్లాడాలి, తనను పరామర్శించాలి అనుకున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామ్యమంటే ఇదేనా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా వైసీపీపై భారీ స్థాయిలో మండిపడ్డాడు. మీడియా ముఖంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒక్కసారిగా తన ఆక్రోషాన్ని వెల్లగక్కారు. వైసీపీ నేతలకు చెప్పు చూపిస్తూ బండ బూతులు తిట్టారు. ఇదిలా ఉండగా ఈ నేపథ్యంలోనే విజయవాడ నోవోటెల్లో చంద్రబాబు పవన్ ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం వేదికగా వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పేర్నినాని ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో 175 స్ధానాల్లోనూ జనసేన అభ్యర్థులను నిలబెడితే ప్యాకేజీ స్టార్ అనే మాటలను వెనక్కి తీసుకుంటామని పేర్ని నాని సవాల్ విసిరారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి వేదికగా వైసీపీ నేతలను బండబూతులు తిట్టాడు. విశాఖ జిల్లాలో జరిగిన జనసేనాని పర్యటనలో జరిగిన అనేక అవమానాల నేపథ్యంలో ఆయన ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు ఎదుట చాలా ఆగ్రహావేశానికి గురయ్యారు. చవట సన్నాసుల్లారా, దద్దమ్మళ్లారా నేను తిట్టలేను అనుకుంటున్నారా అంటూ చెప్పు చూపిస్తూ అధికార పార్టీ నాయకులపై వీరలెవెల్లో మండిపడ్డారు.