Home / Ap latest news
అక్టోబర్ 25న సాయంత్రం 5 గంటల 11 నిముషాల నుండి 6 గంటల 27 నిముషాల మధ్య సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు ఉదయం 8 గంటల 11 నిముషాల నుంచి రాత్రి 7 గంటల 30 నిముషాల వరకు దర్శనం ద్వారాలు మూసే ఉండనున్నాయి.
రేపటి నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. ఇలా ఎంపికైన అభ్యర్థులకు అధికారులు ఈ నెల 12 నుంచి 16 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
తెలుగుదేశం పార్టీ జెండా ఎవరెస్ట్ పై రెపరెపలాడింది. అదెలా అనుకుంటున్నారా, ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని 80 ఏళ్ల వృద్ధుడు అధిరోహించి అరుదైన ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే అక్కడి వరకూ వెళ్లి తాను ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశాడు. మరి ఆ విషయాలేంటో చూసేయ్యండి.
పంచాయతీ ప్రజలకు నమస్కారం. ఖాతాలో అర్థరూపాయి మాత్రమే ఉంది కనుక అభివృద్ధి పనులు చేయలేను కాబట్టి నేన్నేం అడగొద్దు ప్లీజ్ అంటూ ఓ సర్పంచ్ పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. విశాఖ కేంద్రంగా రాజకీయనేతలు వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నారు. కాగా తాజాగా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో నిర్వహించే దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు ముగిశాయి. ఈసారి కూడా దేవరగట్టు కర్రల సమరంలో రక్తం చిందింది. విజయదశమి సందర్భంగా ఊరేగే ఉత్సవ విగ్రహాల కోసం 10 గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకున్నారు.
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు నేడు ముగిసాయి. తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం నాడు శ్రీవారికి చక్రస్నానం కార్యక్రమాన్ని అర్చకస్వాములు వైభవంగా నిర్వహించారు.
CPM Protest in Eluru : వైసీపీ ప్రభుత్వానికి ఓపెన్ ఛాలెంజ్
జీవితంలో ఒక్కసారైనా మంత్రి కావాలనే తన లక్ష్యాన్ని సాధించారు ఆర్కే రోజా. పర్యాటక యువజన సర్వీసులు క్రీడా శాఖ మంత్రిగా చాన్సు కొట్టేశారు. మొదటివిడత సామాజిక సమీకరణాలు కలిసి రాకపోయినా.. పార్టీకి ఫైర్ బ్రాండ్ రోజాకు జగన్ తన మలివిడత విస్తరణలో మంత్రిగా చాన్సు ఇచ్చారు.
Amalapuram : అమలాపురం దసరా ఉత్సవాలు