Home / Ap latest news
సీఎం జగన్ ఈనెల 27న పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలంలోని నేలటూరులో ఏపీ జెన్కో థర్మల్ పవర్ స్టేషన్‌లోని మూడో యూనిట్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటారు. విపక్షనేతల విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్స్ ఇస్తుంటారు
విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలో జనసైనికులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఏడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి ఉద్యమం అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు.
ఏపీ రాజకీయాలు విశాఖ కేంద్రంగా ఉట్టుడుకుతున్నాయి. ఓ వైపు అధికార వైసీపీ విశాఖ గర్జన ర్యాలీ నిర్వహిస్తుండగా మరోవైపు నేడు జనసేనాని విశాఖలో పర్యటించనున్నారు.
వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని అంటూ నేడు విశాఖ గర్జన కార్యక్రమానికి జేఏసీ శ్రీకారం చుట్టింది. మన విశాఖ-మన రాజధాని నినాదంతో అధికార వైసీపీ ఈ ర్యాలీని తలపెట్టింది. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వికేంద్రీకరణకు మద్దతుగా లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొననున్నారు.
ఏపీలోని రాజమండ్రిలో రోడ్ కమ్ రైలు వంతెనపై నేటి నుంచి వారం రోజులపాటు రాకపోకలు అధికారులు నిలిపివేశారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. మరమ్మతుల కోసం వంతెనను మూసివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
"మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది మేమే. ఇందులో పెద్దపెద్ద వాళ్ల హస్తం ఉండడం వల్లే ఈ కేసు ముందుకు వెళ్లడం లేద"ని వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఆరోపించారు.
రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరుగిపోతున్నాయి. తాజాగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వివాహితను ఢీకొట్టి మరీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కామాంధులు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో జరిగింది.
ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత నిధులను అక్టోబరు 17న అర్ఙులైన లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఖరీఫ్‌లో ఇప్పటివరకూ 1.10 కోట్ల ఎకరాల్లో పంటలసాగు జరుగుతుందని, ఇంకా అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో నాట్లు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. గడిచిన మూడేళ్లలో ఉద్యానవన సాగు పెరిగిందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.