Home / AP Global Investors Summit 2023
AP GIS 2023: రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పారిశ్రామిక రంగాలకు ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి సహకారం ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిపై ఆయన ప్రసంగించారు. గడిచిన మూడెళ్లలో ఏపీ ఆర్థికంగా ముందుకు వెళ్తోందని.. నూతన పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చామని అన్నారు.
జీఐఎస్ ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ. 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో భాగంగా ఈరోజు విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో పలు నూతన పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించారు. అనంతరం ఆయన ముగింపు ప్రసంగం ఇచ్చారు. ఈ మేరకు జగన్ మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబదులే ధ్యేయంగా విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండో రోజు ప్రారంభమైంది. నేడు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు జరగనున్నాయి. ఎంవోయూలపై కంపెనీలు ప్రభుత్వాధికారులు సంతకాలు చేయనున్నారు. సదస్సు వద్ద మాట్లాడిన మంత్రి అమర్నాథ్... సీఎం వైఎస్ జగన్ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడని అన్నారు.
GIS 2023: విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సమ్మిట్‌లో భాగంగా సీఎం జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. పర్యావరణ హితం.. పారిశ్రామిక రవాణా మౌలిక వసతులు, సాంకేతికత, వ్యవస్థాపకత ఈ నాలుగు రాష్ట్రానికి మూల స్తంభాల్లాంటివని అభివర్ణించారు.
ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని.. ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు.