Home / Andhra Pradesh
నిత్యం మాజీ సీఎం చంద్రబాబుపై అనుచితంగా మాట్లాడే కొడాలి నానికి తెలుగు తమ్ముళ్లు షాకిస్తున్నారు. పలు చోట్ల కొడాలి నానిని తప్పుబడుతూ విమర్శిస్తున్నారు.
ఎవరెన్ని యాత్రలు చేసినా, తమ ప్రభుత్వ విధానం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటేనని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి జగన్‌ను గద్దె దించాలన్నదే అమరావతి రైతుల పాదయాత్ర లక్ష్యమని ఆరోపించారు.
రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో ఏసీ సీఐడి అయిదుగురిని అరెస్టు చేసింది. గుంటూరు జిల్లా పెదపాలెంకు చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు విచారణ చేసిన సీఐడి 169.27 ఎకరాలకు సంబంధించి వివరాలు సేకరించింది.
వైద్య ఆరోగ్యశాఖ పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ లక్ష్మిషా ఆకస్మిక బదిలీ వివాదంగా మారుతోంది. కొంత మంది వైసీపీ పెద్దలు కావాలనే కమిషనర్‌ను బదిలీ చేయించారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి.
గత కొద్దిరోజులుగా మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల పై టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో విజయవాడలో జరిగిన సమావేశంలో కొడాలి నానిని ఓడించి తీరుతామని టీడీపీ నేతలు సవాల్ విసిరారు
ఏపీ సీఎం జగన్ సోషల్ మీడియా పటిష్టతపై ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియా బాధ్యతలు చూడటానికి తెరపైకి కొత్త పేరు వచ్చింది. ఇప్పటివరకు సోషల్ మీడియా బాధ్యతలు చూసిన విజయసాయిరెడ్డిని కాదని, సజ్జల తనయుడు సజ్జల భార్గవరెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు.
ఏపీతో కేంద్రం ఒక్క ఆట ఆడుకొంటున్నది. ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్క మాటగా పేర్కొంటూ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మరి కొద్ది నెలల్లో ఏపిలో ఎన్నికలు రానున్న నేపధ్యంలో రాజధాని విషయంలో మరో మెలిక పెట్టింది. దీంతో అధికార పార్టీ జగన్ కు కేంద్రం జలక్ ఇచ్చిన్నట్లైయింది.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపి రెబల్ పార్లమెంటు సభ్యులు రఘురామ కృష్ణం రాజు నిత్యం రాష్ట్రంలోని పరిస్ధితులను కేంద్రానికి చేరవేసేందులో ప్రతిపక్షం కన్నా ముందుంటున్నారు. తాజాగా ఆయన హైకోర్టు ఉత్తర్వులను సైతం ఏపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కేంద్ర హోం మినిష్టర్ అమిత్ షాకు లేఖ వ్రాయడం పట్ల సర్వత్రా చర్చకు దారితీసింది.
ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అవుతున్నా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని బీజేపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మంత్రి అంబటి రాంబాబు నుద్దేశించి మాట్లాడారు