Home / Actor Balakrishna
Veera Simha Reddy Review: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’.శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం కావడంలో ‘వీరసింహా రెడ్డి’పై మంచి హైప్ క్రియేట్ అయింది. […]
ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా (aha) ప్రేక్షకుల్లోకి మరింత దూసుకెళ్తుంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ వరుస ఎపిసోడ్ లతో ప్రేక్షకుల్లోకి దూసుకెళ్తుంది. ఈ టాక్ షోకు ఈ మధ్యన విపరీతమైన క్రేజ్ వస్తుంది.
నందమూరి బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి కానుకగా డబుల్ బొనాంజా ఇవ్వనున్నారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షో కి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఒంగోలులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వీరసింహారెడ్డి చిత్ర బృందం కూడా ఈ ఫంక్షన్ కి హాజరయ్యి సందడి చేశారు.
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఏడాది పూర్తి చేసుకుంది. గత ఏడాది ఇదే రోజున విడుదలై అఖండ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదుచేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ అఖండ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. అప్పుడే ఏడాది అయ్యిందంటే నమ్మలేకపోతున్న అంటూ రాసుకొచ్చింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పనవసరం లేదు. కాగా ఎప్పుడెప్పుడు అన్‌స్టాపబుల్ సీజన్ 2 వస్తుందా అని బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి బాలయ్య పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు.