Last Updated:

Veera Simha Reddy Review: వీరసింహా రెడ్డి మూవీ రివ్యూ..

Veera Simha Reddy Review: వీరసింహా రెడ్డి మూవీ రివ్యూ..

Cast & Crew

  • నందమూరి బాలకృష్ణ (Hero)
  • శృతి హాసన్ (Heroine)
  • వరలక్ష్మీ శరత్ కుమార్, మురళీ శర్మ (Cast)
  • గోపీచంద్ మలినేని (Director)
  • నవీన్ యెర్నేని, వై రవిశంకర్ (Producer)
  • తమన్ (Music)
  • Rishi Punjabi (Cinematography)
3

Veera Simha Reddy Review: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’.శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం కావడంలో ‘వీరసింహా రెడ్డి’పై మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ చిత్రానికి తమన్ సంగీత అందించారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి రెస్సాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా కథ, కథనాలు ప్రేక్షకులను ఎంతమేరకు అలంరించాయో చూద్దాం.

కథ

టర్కీ ఇస్తాంబుల్ లో ‘వీరసింహా రెడ్డి’కథ మొదలవుతుంది. జై సింహా రెడ్డి  తన తల్లి హనీ రోజ్ తో కలిసి అక్కడే నివశిస్తుంటారు. ఈ క్రమంలో అక్కడే ఉండే శృతి హాసన్ తో పరియచం అవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తుంది. ఇదే విషయాన్ని శ్రుతి తన తండ్రి మురళీ శర్మతో చెప్పగా.. అందుకు ఆయన కూడా ఒప్పుకుంటాడు. సంబంధం గురించి మాట్లాడానికి జై తల్లిదండ్రులను ఇంటికి రమ్మని పిలుస్తాడు. అప్పటి వరకు తండ్రి లేడు అనుకున్న జై కు అసలు నిజం చెప్తుంది తల్లి హనీ రోజ్.  మరో వైపు వీరసింహా రెడ్డి కథ నడుస్తూ ఉంటుంది. వీరసింహారెడ్డి కి వరలక్ష్మీ సవతి తల్లి కూతురు. చిన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య వైరం నడుస్తూ ఉంటుంది. వరలక్ష్మీ ప్రేమించిన వాడిని బాలయ్య చంపించాడనే ఉద్దేశంతో అన్నపై పగ పెంచుకుంటుంది చెల్లెలు. ఈ క్రమంలో దునియా ప్రతాప్ ను పెళ్లిచేసుకుంటుంది. ఓసారి వీరసింహారెడ్డి టర్కీ కి వెళ్తాడు. అయితే వీరసింహారెడ్డి టర్కీ వెళ్లాడని తెలుసుకున్న ప్రత్యర్థి వర్గం .. అక్కడ ఆయన్ను చంపాలని ప్లాన్ చేస్తుంది. ఎలా అయినా అన్నపై పగ తీర్చుకోవాలన్న చెల్లెలు వరలక్ష్మీ కోరిక తీరుతుందా? అన్నాచెల్లెలు దగ్గర అవుతారా ? వీరసింహారెడ్డి, హనీ రోజ్ ఎందుకు విడిగా ఉండాల్సి వస్తుంది? అనేది సినిమాలో చూడాల్సిందే..

ఎవరెలా చేశారు..

కంప్లీట్ బాలకృష్ణ షో గా వీరసింహా రెడ్డి నిలుస్తుంది. ఫ్యాక్షన్ లీడర్ గా నటించడం బాలయ్య కు కొట్టిన పిండి. ద్విపాత్రాభినయంతో బాలయ్య స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ ఫ్యాన్స్ పండగలా సెలెబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్ గా శ్రుతి హాసన్ ది రెగ్యులర్ కమర్షియల్ పాత్ర. ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. బాలయ్య చెలెల్లిగా వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బాలకృష్ణ , వరలక్ష్మీ మధ్య ఉండే సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయి. మళయాలీ భామ హనీ రోజ్ తో వచ్చే సీన్స్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ వరకు ఆమె తల్లీ పాత్రలో కనపడుతుంది. హీరోయిజం ఎలివేట్ చేసే డైలాగ్స్ పడ్డాయి. ఏపీలోని ప్రభుత్వానికి సూటిగా తగిలేలా రెండు మూడు చోట్ల సెటైర్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మాస్, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో సినిమాను మలిచారు మలినేని.

దునియా విజయ్ , లాల్ , నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు, మురళీ శర్మ , అజయ్ ఘోష్ ..వాళ్ల పరిధి మేరకు నటించారు. అంతేకాకుండా అలీ, బ్రహ్మానందం ఓ సన్నివేశంలో కనిపించి సందడి చేస్తారు. వీటికి తోడుగా బుర్రా సాయి మాధవ్ మాటలు, తమన్ ఆర్ ఆర్ తో పూనకాలు తెప్పిస్తారు. ముఖ్యంగా ‘ సుగుణ సందరీ.., జై బాలయ్యా సాంగ్, మా బావ మనో భావాలు’అనే సాంగ్స్ మాస్ ఆడియన్స్ తో డాన్సులు చేపిస్తాయి.

ఓవరాల్ గా

వీర సింహారెడ్డి గా బాలకృష్ణ విశ్వరూపం చూపిస్తాడు. సినిమా మొత్తాన్నితన భుజాలపై మోశారు. నందమూరి అభిమానులకు పండుగ లాంటి సినిమా ఇది. ఫ్యాక్షన్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే ప్రేక్షకులకు ‘వీరసింహారెడ్డి’ బాగా నచ్చుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. బాలయ్య ఫ్యాన్స్ తో పాటు B,C సెంటర్స్ ఆడియన్స్ కి ఈ సినిమా పండుగే.

ప్లస్ పాయింట్స్

బాలకృష్ణ నటన
థమన్ మ్యూజిక్
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

రెగ్యులర్ కథ
ఆల్రెడీ చూసినట్టుగా ఉండే కొన్ని సీన్లు

ఇవి కూడా చదవండి…

థియేటర్ లో మాస్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. రచ్చ చేసిన ఫ్యాన్స్

బాలకృష్ణ, చిరంజీవి అభిమానుల మధ్య వార్.. వైసీపీ కులాల కుట్ర.. లోకేష్ ట్వీట్ వైరల్

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: