Home / 75th Independence Day
భారతదేశం 2022 ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన "హర్ ఘర్ తిరంగ" పిలుపును దేశప్రజలు స్వీకరించారు. ఈ ఏడాది 30 కోట్లకు పైగా జాతీయ జెండాల విక్రయం ద్వారా దాదాపు రూ. 500 కోట్ల ఆదాయం సమకూరిందని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 15న వేడుకలు ప్రత్యేకించి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎర్రకోటలో 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విశిష్ట అతిథులుగా అంగన్‌వాడీ కార్యకర్తలు, వీధి వ్యాపారులు, మార్చురీ వర్కర్లు, ముద్రా పథకం రుణగ్రహీతలు పాల్గొన్నారు.
స్వాతంత్రదినోత్సవం సందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు ఆర్పించి వెలుగును చాటారు. మహానీయుల త్యాగాల వల్లే స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామని చెప్పారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్ ప్రదర్శనను సీఎం జగన్ తిలకించారు.
స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, కేంద్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య వజ్రోత్సవాల పేరిట రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టు 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకొకటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది
జాతీయ జెండాను తలకిందులుగా పట్టుకున్న బీజేపీ నాయకులు
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రయాణికులపై పలు రాయితీలు ప్రకటించింది. ఈ ఆగస్టు 15న పుట్టే శిశువులు, వాళ్లకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం ప్రకటించారు.
దేశభక్తి, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో రగిలేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు సహా యావత్ తెలంగాణ సమాజం ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.