Last Updated:

Independence day 2022: ప్ర‌తి భార‌తీయుడి హృద‌యం ఉప్పొంగే స‌మ‌యం.. సీఎం కేసీఆర్

స్వాతంత్రదినోత్సవం సందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది స్వాతంత్ర స‌మ‌ర‌యోధులు త‌మ ప్రాణాలు ఆర్పించి వెలుగును చాటారు. మ‌హానీయుల త్యాగాల వ‌ల్లే స్వాతంత్ర ఫ‌లాలు అనుభ‌విస్తున్నామ‌ని చెప్పారు.

Independence day 2022: ప్ర‌తి భార‌తీయుడి హృద‌యం ఉప్పొంగే స‌మ‌యం.. సీఎం కేసీఆర్

Hyderabad: స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది స్వాతంత్ర స‌మ‌ర‌యోధులు త‌మ ప్రాణాలు ఆర్పించి వెలుగును చాటారు. మ‌హానీయుల త్యాగాల వ‌ల్లే స్వాతంత్ర ఫ‌లాలు అనుభ‌విస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌తి భార‌తీయుడి హృద‌యం ఉప్పొంగే స‌మ‌య‌మిది అని తెలిపారు. తెలంగాణలో ప్ర‌తి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందని అన్నారు.

1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంలో వీరోచితంగా పోరాడిన ఝాన్సీలక్ష్మీబాయి మొదలుకొని వేలాది మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలర్పించి స్వాతంత్ర జ్యోతిని వెలిగించారు. స్వాతంత్ర్యం నా జన్మహక్కని చాటిన లోకమాన్య బాలగంగాధర తిలక్, శాంతి, అహింసలతో స్వాతంత్ర్య పోరాటాన్ని శిఖరాగ్రానికి చేర్చిన మహాత్మాగాంధీ, ఆజాద్ హింద్ ఫౌజ్ ను నడిపి సమరసేనానిగా నిలిచిన సుభాష్ చంద్రబోస్, చిరునవ్వుతో ఉరికంబమెక్కిన ధీరోదాత్తుడు భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

స్వాతంత్ర్యం కోసం దేశమంతటా జరిగిన పోరాటంలో మన తెలంగాణ వీరులు ఉజ్వలమైన పాత్రను నిర్వహించారు. తుర్రేబాజ్ ఖాన్, రాంజీ గోండు, మౌల్వీ అలావుద్దీన్, సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పీవీ నర్సింహారావు మొదలైన వారు సాహసోపేతంగా చేసిన పోరాటం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని కేసీఆర్ అన్నారు.

ఇవి కూడా చదవండి: