Home / క్రీడలు
ఆసియా కప్ 2022 నిన్న జరిగిన మ్యాచ్ షార్జా వేదికగా బంగ్లాదేశ్ పై అఫ్గానిస్థాన్ భారీ విజయాన్ని నమోదు చేసింది అలాగే వరుసగా తమ రెండో విజయం సాధించింది.
ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ప్రాక్టీసు మ్యాచ్‌లో రిషబ్ పంత్ క్రీజ్ బయట ఉన్నాడు. ఫామ్‌లో ఉన్న పంత్ క్రీజ్ బయట ఉండటమేంటని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ నటి సారా అలీ ఖాన్‌తో కలిసి రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది, ఇది ఇద్దరి మధ్య డేటింగ్ జరుగుతోందన్న పుకార్లకు దారితీసింది.
ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 5 వికెట్ల తేడాతో , రెండు బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ ను ఫినిష్ చేసారు . పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించారు . టాస్ గెలిచినా ఇండియా మొదట ఫీల్డింగును ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 120 బాల్స్ కు 147 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యారు.
మేలో ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల సీఓఏను సుప్రీంకోర్టు సోమవారం రద్దు చేయడంతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై విధించిన నిషేధాన్ని ఫిఫా ఎత్తివేసింది. దీనితో అక్టోబర్‌లో జరిగే మహిళల U-17 ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి అడ్డంకులు తొలగిపోయాయి.
ఆసియా కప్ లో దాయాది పాకిస్థాన్‌తో ఆదివారం రాత్రి టీమ్ ఇండియా తలపడుతోంది. పాక్ జట్టు టీ20 ప్రపంచకప్‌ను గెలుపొందిన తర్వాత రెండు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. అయితే ఇండియాతో మ్యాచ్ కు ముందే పాక్ కు ఎదురుదెబ్బ తగిలింది. దాని స్టార్ ప్లేయర్ ఒకరైన షాహీన్ అఫ్రిది మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
కొంతమంది వయస్సు కేవలం ఒక సంఖ్య అని చెబుతారు. ఇప్పుడు జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2022లో 64వ రౌండ్లో మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో గెలుపొందడం ద్వారా ఇజ్రాయెల్‌కు చెందిన 64 ఏళ్ల బ్యాడ్మింటన్ క్రీడాకారిణి స్వెత్లానా జిల్బెర్మాన్ అది నిజమని నిరూపించింది.
ఆసియ కప్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. భారతజట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో ఆసియాకప్ కు ద్రావిడ్ దూరమయినట్లే.
హరారే వేదికగా జరిగిన చివరి వన్డేలో 13 పరుగుల తేడాతో జింబాబ్వే పై విజయం సాధించి భారత్, మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే తొలి రెండు వన్డేల్లో పోరాట పటిమ చూపించని జింబాబ్వే చివరి వన్డేలో మాత్రం అద్భుత పోరాటం చేసి ఔరా అని పించింది.
సుప్రీంకోర్టు సోమవారం ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఎఐఎఫ్ఎఫ్) రాజ్యాంగాన్నిసవరించాలని, ఒక వారంలోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ)ని కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది.