Home / క్రీడలు
భారత పేస్ బౌలర్ నవదీప్ సైనీ తన స్నేహితురాలు స్వాతి అస్థానాను వివాహం చేసుకున్నాడు. అతని వివాహ చిత్రాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా స్వాతిని సైనీ పెళ్లి చేసుకున్నాడు.
ఆస్ట్రేలియా - టీమిండియాల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ నేడు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఈ సాయంత్రం విశాఖలో జరగనుంది. మరోవైపు సింహాచలం అప్పన్నను టీమిండియా ఆటగాళ్లు నేడు దర్శించుకున్నారు. అప్పన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆటగాళ్లకు ఆలయ
ఆదివారం ప్రపంచ కప్ లో శ్రీలంక జట్టు బారత్ చేతిలో ఘోరపరాజయం పాలయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో శ్రీలంక క్రీడా మంత్రి రోషన్ రణసింఘే జాతీయ క్రికెట్ బోర్డును రద్దు చేసారు. శ్రీలంక క్రికెట్ బోర్డు నమ్మక ద్రోహం మరియు అవినీతితో కలుషితమయిపోయిందని ఆయన ఆరోపించారు. వెంటనే బోర్డు సభ్యలు రాజీనామా చేయాలని ఆదేశించారు.
వన్డే ప్రపంచకప్ లో వరుసగా ఆరు మ్యాచులను గెలిచిన ఇండియా ఏడవ మ్యాచులో శ్రీలంకపై 302 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ముంబై వాంఖడే స్టేడియంలో భారత పేసర్ల దాటికి చేతులెత్తేసిన శ్రీలంక బ్యాట్స్ మెన్ ఒకరి తరువాత మరొకరు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీనితో శ్రీలంక 55 పరుగులకే ఆలౌట్ అయి ఘోరపరాజయాన్ని పొందింది.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని బుధవారం ముంబై వాంఖడే స్టేడియంలో ఆవిష్కరించారు. ఏప్రిల్లో టెండూల్కర్ 50వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆ సంవత్సరం ప్రారంభంలో ఆవిష్కరించాలని మొదట అనుకున్నారు. అయితే, నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ఇప్పుడు జరిగింది.
దిగ్గజ స్పిన్నర్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ (77) సోమవారం మరణించారు. 1967 మరియు 1979 మధ్య, దిగ్గజ స్పిన్నర్ భారతదేశం తరపున 67 టెస్టులు ఆడి, 266 వికెట్లు పడగొట్టారు. పది వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టారు. బేడీ, ఎరపల్లి ప్రసన్న,చంద్రశేఖర్ మరియు వెంకటరాఘవన్లతో కలిసి భారత స్పిన్ బౌలింగ్ చరిత్రలో కీలకమైన ఆటగాడిగా నిలిచారు.
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023.. ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ క్రికెట్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికపై చిరకాల ప్రత్యర్థులు పోటీ పడుతుండడం సర్వత్రా ఆసక్తి నింపుతుంది.
లాస్ ఏంజిల్స్ లో 2028లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ను కూడా జత చేస్తున్నట్లు ఐఓసీ బోర్డు అమోదం తెలిపింది. కాగా ఐఓసీ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. వచ్చే ఒలింపిక్స్ ఐదు కొత్త క్రీడలను జత చేయనున్నారు.
పురుషుల హాకీలో భారత్ మరోసారి ఆసియా ఛాంపియన్గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన తర్వాత, హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శన చేసింది.శుక్రవారం జరిగిన పురుషుల హాకీ ఫైనల్లో 5-1తో జపాన్ను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది.
క్రికెటర్ శిఖర్ ధావన్ను విడిచిపెట్టిన భార్య ఏషా ధావన్ క్రూరత్వం ప్రదర్శించిందనే కారణంతో ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు బుధవారం అతనికి విడాకులు మంజూరు చేసింది. ధావన్ మరియు ఏషా ముఖర్జీ 2012లో వివాహం చేసుకున్నారు.