Last Updated:

SRH vs RCB: క్లాస్ సెంచరీ.. ఆర్సీబీ లక్ష్యం 187 రన్స్

క్లాసెన్ సూపర్ నాక్ ఆడాడు. లోన్ వారియర్ గా పోరాడిన క్లాసెన్ హైదరాబాద్ జట్టుకు ఓ క్లాసీ స్కోర్ అందించాడు. ఫస్ట్ హాఫ్ మ్యాచ్ ముగిసే సరికి నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 186 పరుగులు చేసింది. దానితో ఆర్సీబీ టార్గెట్ 187 పరుగులుగా ఉంది.

SRH vs RCB: క్లాస్ సెంచరీ.. ఆర్సీబీ లక్ష్యం 187 రన్స్

SRH vs RCB: క్లాసెన్ సూపర్ నాక్ ఆడాడు. లోన్ వారియర్ గా పోరాడిన క్లాసెన్ హైదరాబాద్ జట్టుకు ఓ క్లాసీ స్కోర్ అందించాడు. 49 బంతుల్లో 104 రన్స్ చేసి అతి తక్కువ బంతుల్లో సూపర్ సెంచరీ సాధించిన బ్యాటర్ల లిస్టులో చేరాడు. ఫస్ట్ హాఫ్ మ్యాచ్ ముగిసే సరికి నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 186 పరుగులు చేసింది. దానితో ఆర్సీబీ టార్గెట్ 187 పరుగులుగా ఉంది. ఆర్సీబీ బౌలర్లలో బ్రేస్ వేల్ 2 వికెట్లు తీయగా హర్షల్, శహ్ బాజ్, సిరాజ్ తలో వికెట్ తీశారు. మరి ఈ నిర్ణీత లక్ష్యాన్ని ఛేదించి ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంటుందా లేదా ఓడి ఇంటి బాట పడుతుందా అనేది సెకెండ్ ఇన్నింగ్స్ తో తేలిపోనుంది.

హైదరాబాద్  ఉప్ప‌ల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగ‌ళూరు కెప్టెన్ ఫాప్ డెప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ ఆర్‌సీబీకి చాలా కీల‌కం కానుంది. బెంగ‌ళూరు జట్టు ఈ మ్యాచ్‌లో త‌ప్ప‌ని స‌రిగా విజ‌యం సాధించాల్సి ఉంది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 18 May 2023 09:08 PM (IST)

    ఆర్సీబీ టార్గెట్ 187

    వికెట్ కోల్పోయి ఇన్నింగ్స్ ముగించిన హైదరాబాద్ జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేయగా ఆర్సీబీ టార్గెట్ 187 రన్స్ గా ఉంది.

  • 18 May 2023 09:00 PM (IST)

    క్లాసెన్ ఔట్

    ఇంపార్టెంట్ వికెట్ కోల్పోయింది హైదరాబాద్. 51 బంతుల్లో 104 పరుగులు చేసి ఔట్ అయ్యాడు క్లాసెన్. ప్రస్తుతం సన్ రైజర్స్ స్కోర్ 178/4.

  • 18 May 2023 08:58 PM (IST)

    క్లాస్ సెంచరీ

    49 బంతుల్లో సెంచరీ కొట్టాడు క్లాసెన్. ప్రస్తుతం 175 స్కోర్ తో హైదరాబాద్ జట్టు దూసుకుపోతుంది. క్రీజులో క్లాసెన్, బ్రూక్ ఉన్నారు.

  • 18 May 2023 08:51 PM (IST)

    17 ఓవర్లు: హైదరాబాద్ స్కోర్ 160/3

    17 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ స్కోర్ 160/3. క్రీజులో క్లాసెన్, బ్రూక్ ఉన్నారు.

  • 18 May 2023 08:31 PM (IST)

    కెప్టెన్ మార్ క్రమ్ ఔట్

    కెప్టెన్ మార్ క్రమ్ ఔట్ అయ్యాడు. 20 బంతుల్లో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు స్కోర్ 104/3. క్రీజులో బ్రూక్, క్లాసెన్ ఉన్నారు.

  • 18 May 2023 08:23 PM (IST)

    క్లాసెన్ హాఫ్ సెంచరీ

    క్లాస్ గా హాఫ్ సెంచరీ పూర్తి చేసిన క్లాసెన్. 24 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. 11 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ స్కోర్ 94/2.

  • 18 May 2023 08:19 PM (IST)

    10 ఓవర్లు: హైదరాబాద్ స్కోర్ 81/2

    10 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ స్కోర్ 81/2. క్రీజులో మార్ క్రమ్, క్లాసెన్ ఉన్నారు.

  • 18 May 2023 08:03 PM (IST)

    పవర్ ప్లే: హైదరాబాద్ స్కోర్ 50/2

    ముగిసిన పవర్ ప్లే. ప్రస్తుతం హైదరాబాద్ స్కోర్ 50/2. క్రీజులో మార్ క్రమ్, క్లాసెన్ ఉన్నారు.

  • 18 May 2023 07:54 PM (IST)

    ఒకే ఓవర్లో రెండు వికెట్లు

    బ్రేస్ వేల్ బౌలింగ్లో హైదరాబాద్ జట్టు వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 12 బంతుల్లో 15 పరుగులు చేసి త్రిపాఠి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు స్కోర్ 28/2.

  • 18 May 2023 07:52 PM (IST)

    మొదటి వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    బ్రేస్ వెల్ బౌలింగ్లో అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. 14 బంతుల్లో 11 పరుగులు చేసి అభిషేక్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ స్కోర్ 27/1. క్రీజులో మార్ క్రమ్, త్రిపాఠి ఉన్నారు.

  • 18 May 2023 07:35 PM (IST)

    1 ఓవర్: కేవలం 2 పరుగులు మాత్రమే

    1 ఓవర్ ముగిసే సరికి కేవలం 2 పరుగులు మాత్రమే రాబట్టింది హైదరాబాద్ జట్టు.

  • 18 May 2023 07:34 PM (IST)

    బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్

    అభిషేక్, త్రిపాఠి ఓపెనర్లుగా దిగగా.. సిరాజ్ మొదటి ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు.

  • 18 May 2023 07:15 PM (IST)

    తుది జ‌ట్లు ఇవే

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జ‌ట్టు

    విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్ (వికెట్ కీప‌ర్), షాబాజ్ అహ్మద్, మైకేల్ బ్రేస్‌వెల్, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్

    సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జ‌ట్టు

    అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్‌క్ర‌మ్‌ (కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్‌), హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, కార్తీక్ త్యాగి, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, నితీష్ రెడ్డి

  • 18 May 2023 07:14 PM (IST)

    టాస్ గెలిచిన ఆర్సీబీ

    టాస్ గెలిచిన బెంగ‌ళూరు కెప్టెన్ ఫాప్ డెప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దానితో మొదట సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ చేయనుంది.