Last Updated:

GT vs RR : రాజస్థాన్ పై ప్రతీకారం తీర్చుకున్న గుజరాత్..

ఐపీఎల్‌ 2023 లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో గతంలో ఎదురైన ఓటమికి గట్టిగానే ప్ర‌తీకారం తీర్చుకుంది. నిర్ణీత ఓవర్లలో 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఆది నుంచే దూకుడుగా ఆడి 13.5 ఓవ‌ర్ల‌లో వికెట్

GT vs RR : రాజస్థాన్ పై ప్రతీకారం తీర్చుకున్న గుజరాత్..

GT vs RR : ఐపీఎల్‌ 2023 లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో గతంలో ఎదురైన ఓటమికి గట్టిగానే ప్ర‌తీకారం తీర్చుకుంది. నిర్ణీత ఓవర్లలో 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఆది నుంచే దూకుడుగా ఆడి 13.5 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోయి 9 వికెట్ల తేడాతో ఘన విజ‌యం సాధించింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో వృద్ధిమాన్ సాహా (41 నాటౌట్; 34 బంతుల్లో 5 ఫోర్లు), శుభ్‌మ‌న్ గిల్‌(36; 35 బంతుల్లో 6 ఫోర్లు) రాణించ‌గా.. గిల్ ను పదో ఓవర్లో చాహల్   ఔట్ చేశాడు. చాహల్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడబోయిన  గిల్..  స్టంపౌట్ అయ్యాడు. గిల్ ఔట్ అయిన తర్వాత కీజులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా(39 నాటౌట్; 15 బంతుల్లో 3 ఫోరు, 3 సిక్స‌ర్లు) గుజరాత్ ని విజయ తీరాలకు చేర్చాడు. ఢిల్లీతో మ్యాచ్  లో  స్లో బ్యాటింగ్ తో విమర్శలు ఎదుర్కున్న  హార్ధిక్ ఈ మ్యాచ్ లో మాత్రం ధాటిగా ఆడాడు. 15 బంతుల్లోనే 39 రన్స్ చేశాడు. ఆ ఓవర్లో 6, 4, 6, 6 తో ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో చాహ‌ల్‌ ఓ వికెట్ తీశాడు.

అంత‌క‌ముందు టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 17.5 ఓవ‌ర్ల‌లో 118 ప‌రుగుల‌కు ఆలౌలైంది. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ సంజు శాంస‌న్‌ (30; 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) తో  రాణించాడు. ఇక సంజు మినహా వచ్చిన బ్యాటర్లలో జైశ్వాల్ (14), ప‌డిక్క‌ల్ (12)లు రెండు అంకెల స్కోరుకె పరిమితం అయ్యారు. ఇక మిగతా బ్యాట్స్ మెన్ లు చేతులెత్తేశారు. ధ్రువ్ జురెల్(9), బ‌ట్ల‌ర్‌(8), షిమ్రాన్ హెట్మెయర్(7), ప‌రాగ్‌(4) లు తీవ్రంగా నిరాశ‌ప‌రిచారు. టోర్నీ మొదటి నుంచి మంచి ఫామ్‌లో ఉన్న యశస్వి జైశ్వాల్‌ కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడం.. జోస్ బట్లర్ నిరాశ పరచడం ఫ్యాన్స్ అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. చివర్లో ట్రెంట్ బౌల్ట్‌ (15 పరుగులు, 11 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్స్) కాసేపు బ్యాట్ ఝుళిపించడంతో రాజస్థాన్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ మూడు, నూర్ అహ్మ‌ద్ రెండు వికెట్లు తీయ‌గా ష‌మీ, హార్దిక్ పాండ్యా, జాషువా లిటిల్ లు ఒక్కో వికెట్ ప‌డ‌గొట్టారు.

 

ఈ విజయంతో  గుజరాత్ పాయింట్ల పట్టికలో టాప్ లోనే కొనసాగుతుంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్ లు ఆడిన గుజరాత్.. ఏడింటిలో గెలిచి  14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు రాజస్తాన్ 10 మ్యాచ్ లలో ఐదు మాత్రమే నెగ్గి  పది పాయింట్లతో  నాలుగో స్థానంలో నిలిచింది.  ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఆ జట్టు రాబోయే మ్యాచ్ లలో గెలిచి  తీరక తప్పదు..