Last Updated:

IPL 2023 Final: ఐపీఎల్ విజేత ఎవరంటే.. ఆనంద్ మహీంద్రా ఆన్సర్ ఇదే

ఐపీఎల్‌ విన్నర్‌పై బిజినెస్ మెన్ , మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి అంశంపై అయినా తన అభిప్రాయాలను సూటిగా చెప్పే మహీంద్రా ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆసక్తికర కమెంట్స్‌ తో ట్వీట్ చేశారు.

IPL 2023 Final: ఐపీఎల్ విజేత ఎవరంటే.. ఆనంద్ మహీంద్రా ఆన్సర్ ఇదే

IPL 2023 Final: ఇప్పుడు ఎక్కడా చూసినా ఐపీఎల్ 2023 ఫైనల్ ఫీవర్ నడుస్తోంది. ఉత్కంఠ రేపుతున్న ఫైనల్ మ్యాచ్ ఆదివారం వాయిదా పడటంతో ఈ ఫీవర్‌ మరింత పెరిగింది. సోమవారం రోజు మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ముందు బౌలింగ్ తీసుకుంది.

 

గిల్ టాలెంట్ నమ్ము తున్నా… కానీ(IPL 2023 Final)

కాగా, ఐపీఎల్‌ విన్నర్‌పై బిజినెస్ మెన్ , మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి అంశంపై అయినా తన అభిప్రాయాలను సూటిగా చెప్పే మహీంద్రా ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆసక్తికర కమెంట్స్‌ తో ట్వీట్ చేశారు.

‘ఏ జట్టుకు మద్దతు అని అడిగారు సరే, శుబ్‌మన్ గిల్ టాలెంట్ ను నమ్ము తున్నా. అతను మరింత రాణించాలి అనుకుంటున్నా. కానీ నేను మాత్రం ఎంఎస్‌ ధోనీకి పెద్ద ఫ్యాన్‌. ఈ ఫైనల్‌ పోరులో కప్పు అతనిదే. చివరికి అత్యుత్తమ జట్టును గెలిపిద్దాం’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ ఇప్పటి దాకా 465.4 వేల లైక్స్‌ను సాధించింది. 2021లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శనకు ముగ్ధుడైన ఆనంద్ మహీంద్రా ‘మహీంద్రా థార్’ఎస్‌యూవీని శుభ్‌మాన్ గిల్‌కు బహుమతిగా ఇచ్చారు.

 

కాగా వర్షం కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ 2023 టైటిల్‌ పోరులో జీటీ, సీఎస్కే మధ్య అహ్మదాబాద్‌ వేదికగా రిజర్వ్ డే సోమవారం జరగనున్న మ్యాచ్‌ తీవ్ర ఉత్కంఠను రాజేస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో 60.79 సగటుతో శుభ్‌మన్ గిల్ పరుగులు సాధించాడు. అతను మొత్తం 851 పరుగులు చేశాడు.