Last Updated:

IND vs BAN: టీమిండియాకు “స్లో ఓవర్ రేట్” ముప్పు.. 80 శాతం జరిమానా

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఆదివారం నాడు బంగ్లాతో జరిగిన తొలి వన్డేలో భారత్ పరాభవం చెందింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా స్లో ఓవర్ రేట్ కనపరిచినందుకుగానూ జరిమానా పడింది.

IND vs BAN: టీమిండియాకు “స్లో ఓవర్ రేట్” ముప్పు.. 80 శాతం జరిమానా

IND vs BAN: టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఆదివారం నాడు బంగ్లాతో జరిగిన తొలి వన్డేలో భారత్ పరాభవం చెందింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా స్లో ఓవర్ రేట్ కనపరిచినందుకుగానూ జరిమానా పడింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయకపోవడంతో టీమిండియా మ్యాచ్ ఫీజులో 80 శాతం జరిమానాగా విధించారు.

నిర్ణీత సమయానికి భారత్ 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసినట్టు మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగళే గుర్తించారు. స్లో ఓవర్ రేట్ అనేది ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం తప్పిదం. ఇలా స్లో ఓవర్ రేట్ చేసిన జట్టుకు ఒక ఓవర్ కు 20 శాతం చొప్పున మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. ఆ లెక్కన ఇప్పుడు టీమిండియాకు నిర్ణీత సమయానికి 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేయడంతో 80 శాతం మ్యాచ్ ఫీజు ఫైన్ విధించారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరంలేకుండా జరిమానాతో సరిపెట్టారు.

ఇదీ చదవండి: టీమిండియాపై బంగ్లా స్పిన్నర్ అరుదైన రికార్డ్.. 36 పరుగులు, 5 వికెట్లు..!

ఇవి కూడా చదవండి: