SRH vs KKR: రాణించిన రింకూ సింగ్.. సన్ రైజర్స్ లక్ష్యం 172 పరుగులు
SRH vs KKR: ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కోల్‌కతా తొమ్మిది మ్యాచ్‌లు ఆడగా మూడు మ్యాచుల్లో గెలిచింది. సన్‌రైజర్స్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి మూడు మ్యాచుల్లో విజయం సాధించింది.
SRH vs KKR: చివర్లో సన్ రైజర్స్ బౌలర్లు రాణించడంతో.. కోల్ కతా భారీ స్కోర్ కు కళ్లెం పడింది. 20 ఓవర్లలో కోల్ కతా 171 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. నైట్ రైడర్స్ జట్టులో నితీష్ రాణా, రింకూ సింగ్ రాణించారు. హైదరాబాద్ జట్టులో నటరాజన్, జాన్ సెన్ చెరో రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్, త్యాగి, మర్ క్రమ్, మార్కండే తలో వికెట్ తీశారు.