Last Updated:

SRH vs LSG: గేమ్ ఛేంజర్గా మారిన పూరన్.. లక్నో ఘన విజయం

దాదాపు సన్ రైజర్స్ మ్యాచ్ విన్ అవుతుంది అనుకుంటుండగా మూడో స్థానంలో వచ్చిన పూరన్ ఒక్కసారిగా మొత్తం గేమ్ ను మార్చేశాడు. సన్ రైజర్స్ చేతిలో ఉన్న విన్నింగ్ ను ఒక్కసారిగా తనవైపు లాగేసుకుని వరుస సిక్సులతో పూరన్ లక్నో విజయంలో కీలక ప్లేయర్ గా మారాడు. నిర్ణీత 20 ఓవర్లో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం కేతనం ఎగురవేసింది లక్నో జట్టు.  

SRH vs LSG: గేమ్ ఛేంజర్గా మారిన పూరన్.. లక్నో ఘన విజయం

SRH vs LSG: దాదాపు సన్ రైజర్స్ మ్యాచ్ విన్ అవుతుంది అనుకుంటుండగా మూడో స్థానంలో వచ్చిన పూరన్ ఒక్కసారిగా మొత్తం గేమ్ ను మార్చేశాడు. సన్ రైజర్స్ చేతిలో ఉన్న విన్నింగ్ ను ఒక్కసారిగా తనవైపు లాగేసుకుని వరుస సిక్సులతో పూరన్ లక్నో విజయంలో కీలక ప్లేయర్ గా మారాడు. నిర్ణీత 20 ఓవర్లో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం కేతనం ఎగురవేసింది లక్నో జట్టు.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ జట్టు చివర్లో తడబడింది. భారీ స్కోర్ చేసేలా కనిపించిన చివర్లో వికెట్లు పడటంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ 182 పరుగులు చేసింది.

 

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 13 May 2023 07:14 PM (IST)

    పూర్తి మ్యాచ్ ను మార్చేసిన పూరన్.. లక్నో విజయం

    సన్ రైజర్స్ చేతిలో నుంచి మ్యాచ్ లాగేసుకున్న లక్నో. పూర్తిగా మ్యాచ్ తీరునే టర్న్ చేసిన లక్నో బ్యాటర్ పూరన్. 7 వికెట్ల తేడాతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో జట్టు హైదరాబాద్ జట్టుపై ఘనవిజయం సాధించింది.

  • 13 May 2023 06:56 PM (IST)

    వచ్చీ రాగానే సిక్సులు బాదుతున్న పూరన్

    స్టాయినీస్ స్టాండ్ తీసుకున్న పూరన్ వరుస సిక్సులు బాదుతున్నాడు. 15 ఓవర్ పూర్తిగా ఎక్స్ పెన్సివ్ గా మారింది. 5 సిక్సులు బాదారు లక్నో బ్యాటర్లు. ప్రస్తుతం లక్నో స్కోర్ 145/3. క్రీజులో పూరన్, మన్కాడ్ ఉన్నారు.

  • 13 May 2023 06:52 PM (IST)

    డేంజరస్ బ్యాటర్ స్టాయినీస్ ఔట్

    వరుస సిక్సులు బాదుతూ సన్ రైజర్స్ కు డేంజరస్ గా మారిన లక్నో బ్యాటర్ స్టాయినీస్ ఔట్ అయ్యాడు. 25 బంతుల్లో 40 పరుగులు చేసి స్టాయినీస్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం లక్నో స్కోర్ 127/3.

  • 13 May 2023 06:50 PM (IST)

    స్టాయినీస్ బ్యాక్ టు బ్యాక్ సిక్సులు

    స్టాయినీస్ బ్యాక్ టు బ్యాక్ సిక్సులు బాదుతున్నాడు. 15వ ఓవర్లో వరుసగా రెండు సిక్సులు బాదాడు.

  • 13 May 2023 06:46 PM (IST)

    మన్కాడ్ హాఫ్ సెంచరీ

    మన్కాడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 35 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశారు. ప్రస్తుతం క్రీజులో మన్కాడ్, స్టాయినీస్ ఉన్నారు.

  • 13 May 2023 06:23 PM (IST)

    10 ఓవర్లు: లక్నో స్కోర్ 68/2

    10 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్ 68/2. ప్రస్తుతం క్రీజులో మన్కాడ్, స్టాయినీస్ ఉన్నారు.

  • 13 May 2023 06:13 PM (IST)

    డికాక్ ఔట్

    మార్కండే బౌలింగ్లో డికాక్ ఔట్ అయ్యాడు.  19 బంతుల్లో 29 పరుగులు చేసి డికాక్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం లక్నో స్కోర్ 54/2.

  • 13 May 2023 06:02 PM (IST)

    పవర్ ప్లే: లక్నో స్కోర్ 30/1

    పవర్ ప్లే ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్ 30/1. ప్రస్తుతం క్రీజులో మన్కాడ్, డికాక్ ఉన్నారు.

  • 13 May 2023 05:50 PM (IST)

    SRH vs LSG: తొలి వికెట్ కోల్పోయిన లక్నో

    లక్నో తొలి వికెట్ కోల్పోయింది. డేంజర్ బ్యాట్స్ మెన్ కైల్ మేయర్స్ ఫిలిఫ్స్ బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు.

  • 13 May 2023 05:47 PM (IST)

    SRH vs LSG: మూడు ఓవర్లకు 12 పరుగులు

    మూడో ఓవర్లో 8 పరుగులు వచ్చాయి.

  • 13 May 2023 05:43 PM (IST)

    SRH vs LSG: రెండో ఓవర్.. రెండు పరుగులు

    రెండో ఓవర్ ను ఫరూఖీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్లో రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు.

  • 13 May 2023 05:39 PM (IST)

    SRH vs LSG: తొలి ఓవర్.. రెండు పరుగులే ఇచ్చిన భువి

    తొలి ఓవర్ ను భువనేశ్వర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.

  • 13 May 2023 05:39 PM (IST)

    SRH vs LSG: లక్నో బ్యాటింగ్.. క్రీజులోకి డికాక్, కైల్ మేయర్స్

    తొలి ఓవర్ భువనేశ్వర్ వేస్తున్నాడు.

  • 13 May 2023 05:38 PM (IST)

    SRH vs LSG: లక్నో బ్యాటింగ్.. క్రీజులోకి డికాక్, కైల్ మేయర్స్

    భువనేశ్వర్ తొలి ఓవర్ వేస్తున్నాడు.

  • 13 May 2023 05:21 PM (IST)

    SRH vs LSG: చివర్లో తడబడిన సన్ రైజర్స్.. లక్నో లక్ష్యం 183 పరుగులు

    సన్ రైజర్స్ చివర్లో తడబడింది. భారీ స్కోర్ చేసేలా కనిపించిన చివర్లో వికెట్లు పడటంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ 182 పరుగులు చేసింది. బ్యాటింగ్ లో క్లాసెన్, సింగ్ రాణించారు. చివర్లో సమద్ ధాటిగా ఆడాడు.

    లక్నో బౌలర్లలో.. కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీసుకున్నాడు. యుద్ వీర్, ఆవేష్ ఖాన్, యాష్ ఠాకూర్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీసుకున్నారు.

     

     

  • 13 May 2023 04:56 PM (IST)

    SRH vs LSG: ధాటిగా ఆడుతున్న క్లాసెన్..

    మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ క్లాసెన్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో 17 ఓవర్లకు సన్ రైజర్స్ 150 పరుగులు దాటింది.

  • 13 May 2023 04:35 PM (IST)

    SRH vs LSG: రెండు బంతుల్లో రెండు వికెట్లు..

    కృనాల్ పాండ్యా వరుస బంతుల్లో వికెట్లు తీశాడు. మెుదటి బంతికి మర్ క్రమ్ ఔటవ్వగా.. ఆ తర్వాతి బంతికే గ్లెన్ ఫిలిఫ్స్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

  • 13 May 2023 04:32 PM (IST)

    SRH vs LSG: గట్టి దెబ్బ.. సన్ రైజర్స్ కెప్టెన్ ఔట్

    జోరు మీదున్న మర్ క్రమ్ ఔటయ్యాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్ లో స్టాంపౌట్ అయ్యాడు.

  • 13 May 2023 04:22 PM (IST)

    SRH vs LSG: 10 ఓవర్లకు 95 పరుగులు

    10 ఓవర్లు పూర్తయ్యేసరికి సన్ రైజర్స్ 3 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.

  • 13 May 2023 04:17 PM (IST)

    SRH vs LSG: మూడో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్

    సన్ రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. అమిత్ మిశ్రా బౌలింగ్ లో అన్ మోల్ ప్రీత్ సింగ్ క్యాచ్ ఔటయ్యాడు. దీంతో 82 పరుగుల వద్ద సన్ రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది.

  • 13 May 2023 04:14 PM (IST)

    SRH vs LSG: 8 ఓవర్లకు 73 పరుగులు

    మర్ క్రమ్, సింగ్ దాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్నారు. 8 ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ 73 పరుగులు చేసింది.

  • 13 May 2023 04:03 PM (IST)

    SRH vs LSG: రెండో వికెట్ డౌన్.. రాహుల్ త్రిపాఠి ఔట్

    సన్ రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. యాష్ ఠాకూర్ బౌలింగ్ లో త్రిపాఠి క్యాచ్ ఔటయ్యాడు.

  • 13 May 2023 03:56 PM (IST)

    SRH vs LSG: రాహుల్ త్రిపాఠి జోరు.. వరుసగా రెండు ఫోర్లు

    రాహుల్ త్రిపాఠి దాటిగా ఆడుతున్నాడు. ఆవేష్ ఖాన్ బౌలింగ్ లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు.

  • 13 May 2023 03:50 PM (IST)

    SRH vs LSG: ముగిసిన మూడో ఓవర్.. 26 పరుగులు

    మూడు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 26 పరుగులు చేసింది.

  • 13 May 2023 03:44 PM (IST)

    SRH vs LSG: తొలి వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్.. అభిషేక్ ఔట్

    సన్ రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. యుద్ వీర్ బౌలింగ్ లో అభిషేక్ కీపర్ క్యాచ్ ఔటయ్యాడు. దీంతో 19 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది.

  • 13 May 2023 03:35 PM (IST)

    SRH vs LSG: తొలి ఓవర్.. కేవలం 8 పరుగులే

    యుద్ వీర్ సింగ్ వేసిన తొలి ఓవర్లో 8 పరుగులు వచ్చాయి.

  • 13 May 2023 03:31 PM (IST)

    SRH vs LSG: సన్ రైజర్స్ బ్యాటింగ్.. క్రీజులోకి అన్ మోల్ ప్రీత్ సింగ్, అభిషేక్

    యుద్ వీర్ సింగ్ తొలి ఓవర్ వేస్తున్నాడు.

  • 13 May 2023 03:22 PM (IST)

    SRH vs LSG: లక్నో సూపర్ జెయింట్స్ తుది జ‌ట్టు

    క్వింటన్ డి కాక్(వికెట్ కీప‌ర్‌), కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా(వికెట్ కీప‌ర్‌), ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్ చరక్, అవేష్ ఖాన్

  • 13 May 2023 03:21 PM (IST)

    SRH vs LSG: సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జ‌ట్టు

    అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్‌), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హాక్ ఫరూఖీ