Last Updated:

Brian Lara: ‘వాళ్లు మమ్మల్ని ఓడించలేదు.. మేమే చేతులారా మ్యాచ్ ను కోల్పోయాం’

ఐపీఎల్ 2023 సీజన్.. హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఏమాత్రం కలిసి రాలేదు. సీజన్ ప్రారంభం నుంచి విజయాన్ని అందుకోవడంతో తడబడుతోంది.

Brian Lara: ‘వాళ్లు మమ్మల్ని ఓడించలేదు.. మేమే చేతులారా మ్యాచ్ ను కోల్పోయాం’

Brian Lara: ఐపీఎల్ 2023 సీజన్.. హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఏమాత్రం కలిసి రాలేదు. సీజన్ ప్రారంభం నుంచి విజయాన్ని అందుకోవడంతో తడబడుతోంది. నెగ్గుతామకున్న మ్యాచుల్లో కూడా చివరకు వచ్చే సరికి చేతులెత్తేస్తోంది. దీంతో ఓటమి తప్పడం లేదు. తాజాగా ఉప్పల్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అనూహ్యంగా ఓటమి మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ లో కోల్ కతా ఇచ్చిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. దీంతో హైదరాబాద్ జట్టు హెడ్ కోచ్ బ్రియాన్ లారా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

బాధ్యతాయుతంగా ఆడాలి(Brian Lara)

మ్యాచ్ అనంతరం లారా స్పందిస్తూ.. ‘పవర్‌ప్లేలో రెండు వికెట్లు కోల్పోతూనే ఉన్నాం. దీంతో ఆ తర్వాత పరిస్థితులు కష్టంగా మారుతున్నాయి. మరోవైపు ఆరో స్థానంలో వచ్చి అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్న క్లాసెన్‌ మరింత కష్టపడాలని కోరుతున్నాం. అతడికి ముందు 5 మంది క్వాలిటీ బ్యాటర్లు ఉన్నారు. ఇలాంటి మ్యాచ్‌ల్లో విజయం సాధించాలంటే ఎంత బాధ్యతాయుతంగా ఆడాలో వారికి తెలుసు. అయితే.. మేం అలా చేయలేకపోతున్నాం. పరుగుల భాగస్వామ్యాలను నిర్మించడానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. మ్యాచ్‌ పరిస్థితి అర్థం చేసుకుంటూ ఆడాలి. దూకుడుగా ఉండటం మంచిదే.. అయితే పని పూర్తి చేయడానికి ఆధిక్యాన్ని కూడా కనబరచాలి. ఈ మ్యాచ్‌లో కోల్ కతా మమ్మల్ని ఓడించలేదు. మేమే చేజేతులా ఓడిపోయాం. మా చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను కోల్పోయాం’ అని లారా అసహం వ్యక్తం చేశాడు.

కాగా, కోల్‌కతా జట్టులో ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉన్నారని లారా తెలిపారు. సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తిలను లారా ప్రశంసించాడు. ఈ మ్యాచ్‌ ఓటమితో హైదరాబాద్‌ ప్లేఆఫ్‌ అవకాశాలను సన్ రైజర్స్ మరింత కష్టతరం చేసుకుంది. 6 ఓటములు చవి చూసిన ఎస్ఆర్ హెచ్ పాయింట్స్ టేబులో లో 9 వ స్థానంలో ఉంది.

 

Image

 

గెలిచే మ్యాచ్ లో ఓటమి..

ఉత్కంఠ పోరులో కోల్ కతా విజయం సాధించింది. గెలిచే మ్యాచ్ ను సైతం సన్ రైజర్స్ చేజార్చుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా సన్ రైజర్స్ ఓటమిపాలైంది. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం.. క్రీజులో అబ్దుల్ సమద్ తో పాటు మరో మూడు వికెట్లు ఉన్నాయి. అందరూ సన్ రైజర్స్ దే గెలుపు అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఓవర్ పూర్తయ్యేసరికి ఐదు పరుగుల తేడాతో కోల్ కతా విజయం. ఆఖరి ఓవర్ ను అద్భుతంగా బౌలింగ్ చేసి.. వరుణ్ చక్రవర్తి కోల్ కతా కు విజయాన్ని అందించారు.