Last Updated:

Neeraj Chopra: నీరజ్ కు డైమండ్ దాసోహం

భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఇండియన్ స్టార్ అథ్లెట్ మరో భారీ విజయాన్ని అందుకున్నాడు. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌లో జరిగిన డైమండ్ ట్రోఫీ అథ్లెటిక్స్ లో విజేతగా నిలిచి డైమండ్ ట్రోఫీ గెలిచిలిన తొలి భారతీయుడిగా చరిత్రకెక్కాడు.

Neeraj Chopra: నీరజ్ కు డైమండ్ దాసోహం

Athlete Neeraj Chopra: భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఇండియన్ స్టార్ అథ్లెట్ మరో భారీ విజయాన్ని అందుకున్నాడు. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌లో జరిగిన డైమండ్ ట్రోఫీ అథ్లెటిక్స్ లో విజేతగా నిలిచి డైమండ్ ట్రోఫీ గెలిచిలిన తొలి భారతీయుడిగా చరిత్రకెక్కాడు.

స్విట్జర్లాండ్ లో జరిగిన మెన్స్ జావెలిన్ థ్రోలో డైమండ్ ట్రోఫీని నీరజ్ గెలుపొందాడు. ఈ పోటీలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వాడ్లెక్, జర్మనీకి చెందిన జులియన్ వెబ్బర్‌ పోటీని ఎదుర్కొని విజయ కేతనం ఎగురవేశాడు. నీరజ్ 88.44 మీటర్లు జావెలిన్ థ్రో చేసి మొదటి స్థానం సంపాదించగా, చెక్ రిపబ్లిక్ అథ్లెట్ వాడ్లెక్ 86.94 మీటర్లు థ్రో చేసి రెండో స్థానంలో నిలిచాడు.

గత ఏడాది జరిగిన ఒలంపిక్స్‌లో నీరజ్ చోప్రా జావలిన్ థ్రోలో బంగారు పతకం సాధించగా, ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో వెండి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. నీరజ్ గతంలో కూడా డైమండ్ ‌లీగ్‌లో పార్టిసిపేట్ చేశాడు. 2017లో నీరజ్ ఏడో స్థానంలో నిలువగా, 2018లో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ సారి మాత్రం డైమండ్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగి ఎట్టకేలకు ట్రోఫీని తన కైవసం చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి: