Published On:

Vivo Y400 Pro 5G Launch: అరాచకం అంతే.. వివో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. రాస్కో పక్కా హిట్ అంతే!

Vivo Y400 Pro 5G Launch: అరాచకం అంతే.. వివో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. రాస్కో పక్కా హిట్ అంతే!

Vivo Y400 Pro 5G Launching soon in India: వివో Y400 Pro 5G త్వరలో భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శుక్రవారం Xలో ప్రకటించింది. వివో తన ఇండియా వెబ్‌సైట్‌లోని ఈవెంట్ పేజీ ద్వారా కొత్త Y-సిరీస్ స్మార్ట్‌ఫోన్ టీజర్ విడుదల చేసింది. ఈ లిస్టింగ్ ప్రకారం ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌ ఉంటుందని భావిస్తున్నారు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. అలానే 5,500mAh బ్యాటరీని అందించవచ్చు.

 

వివో ఒక టీజర్ వీడియో ద్వారా భారతదేశంలో Vivo Y400 Pro 5G రాకను ప్రకటించింది. కంపెనీ తన ఇండియా వెబ్‌సైట్‌లో రాబోయే స్మార్ట్‌ఫోన్ వెనుక డిజైన్‌ను టీజ్ చేస్తూ ల్యాండింగ్ పేజీని కూడా సృష్టించింది. వివో ఈ ఫోన్ ఖచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించలేదు, కానీ దానిపై ‘త్వరలో వస్తుంది’ అనే లేబుల్‌తో టీజ్ చేయబడింది. టీజర్ వీడియోలో Vivo Y400 Pro 5G వైట్ కలర్‌లో కనిపిస్తుంది, వెనుక భాగంలో పిల్ ఆకారపు డ్యూయల్ కెమెరా యూనిట్ ఉంటుంది. కెమెరా సెన్సార్లు నిలువుగా ఉన్నాయి. రింగ్ LED ఫ్లాష్‌తో కలిసి ఉంటాయి.

 

Vivo Y400 Pro 5G Price

లీక్‌ల ప్రకారం, Vivo Y400 Pro 5G ధర భారతదేశంలో దాదాపు రూ. 25,000 ఉంటుంది. గోల్డ్, నెబ్యులా పర్పుల్, వైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. 8జీబీ ర్యామ్ 128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు.

 

 

Vivo Y400 Pro 5G Features

లీక్‌ల ప్రకారం.. వివో వై400 ప్రోలో 6.77-అంగుళాల ఫుల్-హెచ్‌డి ప్లస్ 3డి కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం, ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఫోన్ మందం 7.4మి.మీ ఉంటుంది.

 

ఇది ఆండ్రాయిడ్ 15-ఆధారిత Funtouch 15తో రావచ్చు. వివో వై400 Pro 5జీలో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ రియర్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ షూటర్ ఉంటాయని లీకులు చెబుతున్నాయి. ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. దీనికి 90W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీ ఉంటుంది.