Last Updated:

Hunt Movie Review : సుధీర్ బాబు హంట్ మూవీ ఎలా ఉందంటే..?

Hunt Movie Review : సుధీర్ బాబు హంట్ మూవీ ఎలా ఉందంటే..?

Cast & Crew

  • సుధీర్ బాబు (Hero)
  • . (Heroine)
  • శ్రీకాంత్, భరత్, కబీర్‌ సింగ్, చిత్రా శుక్ల, మైమ్‌ గోపీ, గోపరాజు రమణ, మంజుల ఘట్టమనేని, రవి వర్మ తదితరులు (Cast)
  • మహేష్ సూరపనేని (Director)
  • వి.ఆనంద్ ప్ర‌సాద్ (Producer)
  • జిబ్రాన్ (Music)
  • (Cinematography)
2

Hunt Movie Review : ప్రముఖ హీరో సుధీర్ బాబు గురించి అందరికీ తెలిసిందే. వైవిధ్యమైన పాత్రలు చేసి నటుడిగా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్ బాబు. కాగా తాజాగా  ‘కథలో రాజకుమారి’ ఫేమ్ మహేశ్ డైరెక్షన్ లో ‘హంట్’ అనే  సినిమా చేశారు. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పై ఆనంద్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. కాగా ఈ సినిమాలో సుధీర్ బాబుతో సమానమైన పాత్రలో ‘ప్రేమిస్తే’ ఫేమ్ భారత్ కనిపించబోతున్నాడు. హీరో శ్రీకాంత్ మరో ముఖ్య పాత్రలో కనిపిస్తుండగా గోపురాజ్ రమణ, మౌనిక రెడ్డి ప్రధాన పాత్రలు చేస్తున్నారు. నేడు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా ఎలా ఉందో మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ..

అర్జున్‌ అలియాస్‌ అర్జున్‌ ప్రసాద్‌ (సుధీర్‌బాబు) అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌. సైబరాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో విధులు నిర్వర్తిస్తుంటారు. ఓ రోడ్డు ప్రమాదం వల్ల గతం మర్చిపోతాడు. ఆ ప్రమాదం జరగడానికి ముందు తన మిత్రుడు, తోటి ఐపీఎస్‌ ఆఫీసర్‌ ఆర్యన్‌ దేవ్‌ (భరత్‌) హత్య కేసును డీల్‌ చేస్తాడు. ఆ హత్యకు కారకులైన వారిని కనిపెట్టినట్టు పోలీస్‌ కమిషనర్‌ మోహన్‌ భార్గవ్‌ (శ్రీకాంత్‌)కు ఫోన్లో చెబుతుండగానే ప్రమాదానికి గురవుతాడు. కానీ, ఆ తర్వాత గతం మర్చిపోవడంతో ఆ కేసును మళ్లీ కొత్తగా ఇన్వెస్టిగేట్‌ చేయాల్సి వస్తుంది. అసలు తనెవరో తనకే తెలియని అర్జున్‌.. తన గత జీవితం గురించి తెలుసుకుంటూ మరోవైపు ఆర్యన్‌ హత్య కేసును ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అసలు అర్జున్‌ గతమేంటి? అతనికి, ఆర్యన్‌కు మధ్య ఉన్న స్నేహ బంధం ఎలాంటిది? ఆర్యన్‌ దేవ్‌ హత్య కేసుకు క్రిమినల్‌ రాయ్‌ (మైమ్‌ గోపీ), కల్నల్‌ విక్రమ్‌ (కబీర్‌ సింగ్‌), టెర్రరిస్ట్‌ గ్రూప్‌ హర్కతుల్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఆర్యన్‌ను చంపిన వాళ్లను అర్జున్‌ ఎలా కనిపెట్టాడు? ఆఖర్లో ఆయన ఇచ్చిన షాక్‌ ఏంటి? అన్నవి తెరపై చూసి తెలుసుకోవాలి.

మూవీ విశ్లేషణ (Hunt Movie Review) ..

మలయాళంలో విజయవంతమైన ‘ముంబయి పోలీస్‌’కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. గతం మర్చిపోయిన ఓ పోలీస్‌ అధికారి.. తన గతాన్ని తెలుసుకుంటూ ఓ కీలక హత్య కేసును ఎలా ఛేదించాడన్నదే క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. దర్శకుడు సినిమాని ఆరంభించిన తీరు.. చకచకా కథలోకి తీసుకెళ్లిన విధానం చూస్తే ప్రేక్షకులకు కచ్చితంగా ఓ అదిరిపోయే థ్రిల్లర్‌ చూడబోతున్నామన్న అనుభూతి కలుగుతుంది. ఆర్యన్‌ హత్య కేసును ఛేదించినట్టు మోహన్‌కు అర్జున్‌ ఫోన్లో చెప్పడం.. అంతలోనే అతని కారు ప్రమాదానికి గురవ్వడం.. కట్‌ చేస్తే తను గతం మర్చిపోవడం.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే ఓ ముఠా అతనిపై ఎటాక్‌ చేయడం.. ఇలా ప్రతి ఎపిసోడ్‌ ఆసక్తిరేకెత్తించేలా సాగిపోతుంది. కానీ ఆ తర్వాత ఎక్కడా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ను చూస్తున్నామనే భావన కలగదు. పైగా లేని పోని సందేహాలు కలగడం కోసం దర్శకుడు నానా రకాల ప్రయత్నాలు చేశాడు. చివరకు అవన్నీ ఫాల్స్ సస్పెక్ట్స్ కింద తేల్చేశాడు. అసలైన ట్విస్ట్ ను సినిమా ప్రీ క్లయిమాక్స్ లో రివీల్ చేశారు. ఇక చివర్లో ఊహకందని వ్యక్తిని ప్రేక్షకుల ముందు హంతకుడిగా నిలిపినా, దానికి రీజన్ ఏమాత్రం బలం లేక సినిమా తేలిపోయింది. ప్రీ క్లైమాక్స్‌లో అర్జున్‌ పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ఆర్యన్‌ పాత్రను చంపడానికి గల కారణాన్ని దర్శకుడు బలంగా రాసుకోలేకపోయారు. ఆయన సినిమాని ముగించే విషయంలోనూ కంగారు పడినట్టు అర్థమవుతుంది.

నటీనటుల విషయానికి వస్తే…  సుధీర్ బాబు కెరీర్ ను ఒకసారి గమనిస్తే అతను రొటీన్ కు భిన్నమైన పాత్రలు చేస్తున్నాడు. బాలీవుడ్ లో ఏకంగా విలన్ గానే నటించాడు. తెలుగులో కొంతకాలంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీస్ చేస్తున్నాడు.  పతాక సన్నివేశాల్లో ఆయన నటన అందర్నీ కట్టిపడేస్తుంది. సుధీర్ బాబు తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేశాడు. మరోసారి బిగ్ స్క్రీన్ పై సిక్స్ ప్యాక్ ను ప్రదర్శించాడు. శ్రీకాంత్, భరత్‌లవి కథలో కీలక పాత్రలే అయినప్పటికీ.. వాళ్లకు నటించే ఆస్కారం అంతగా లభించలేదు. కోలీవుడ్ నుండి భరత్ ను ఈ పాత్ర కోసం తీసుకొచ్చారంటే… సమ్ థింగ్ స్పెషల్ గా అది ఉంటుందని ఊహించుకున్న వారికి నిరాశే మిగులుతుంది. అరుణ్ విన్సెంట్ ఫోటోగ్రఫీ, జిబ్రాన్ నేపథ్య సంగీతం ఓకే. మొత్తానికి ఈ సినిమాతో సుధీర్ బాబు నిరాశ పరిచాడు.

ప్లస్ పాయింట్స్ ..

ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
యాక్షన్ సీక్వెన్స్
ప్రొడక్షన్ వాల్యూస్

మైనెస్ పాయింట్స్..

ఆకట్టుకోని కథనం
స్లో నేరేషన్

కంక్లూజన్..  విఫలమైన వేట

ఇవి కూడా చదవండి: