Home / పొలిటికల్ వార్తలు
జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని.. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన - తెదేపా ప్రభుత్వం రాబోతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. నేడు నాలుగో దశ యాత్రలో భాగంగా పెడనలో బహిరంగసభలో పవన్ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..
ప్రధాని మోదీ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గత ఆదివారం నాడు మహబూబ్ నగర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. రెండురోజుల వ్యవధిలో తెలంగాణలో ప్రధాని రెండోసారి పర్యటించడం గమనార్హం. ఈ వరుస పర్యటనల నేపధ్యంలో ప్రధాని మోదీ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు.
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఏపీ సీఎం జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు ఆయనను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. ఈ మేరకు ముందుగా విశాఖ జిల్లా పరవాడలో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు 41A, 41B నోటీసులిచ్చి అరెస్టు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ యాత్ర విజయవంతంగా నేడు మూడో రోజు జరుగుతుంది. ఈ మేరకు ముందుగా ప్రకటించిన ప్రకారం.. మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రజలతో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రజల తమ సమస్యలను
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్దమని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తాము పోటీచేసే స్థానాల జాబితాను తాజాగా విడుదల చేసింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగవ విడత వారాహి యాత్రలో భాగంగా మచిలీపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పింగళి వెంకయ్య, రఘుపతి వెంకటరత్నం నాయుడు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్‌లో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు సీఐడీ నోటీసులు అందించింది. అక్టోబర్ 4వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ స్కామ్‌లో నారాయణ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ఇదివరకే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఆయన అరెస్ట్ కు నిరసనగా తెలుగుదేశం పార్టీ నేడు గాంధీ జయంతి సందర్భంగా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. సత్యమేవ జయతే పేరుతో ఈ దీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం అయిన
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నారు. ఈ మేరకు వారాహి యాత్ర నాలుగో దశలో భాగంగా ఈరోజు మచిలీపట్నంలోపర్యటించనున్నారు. అందులో భాగంగానే మచిలీపట్నంలో ముందుగా మహాత్మా గాంధీకి పవన్ నివాళులర్పిస్తున్నారు. ఆ తర్వాత వారాహి యాత్రలో భాగంగా.. కృష్ణాజిల్లా కార్యవర్గంతో సమావేశం కానున్నారు.
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఆయన అరెస్ట్ కు నిరసనగా టీడీపీ అధిష్టానం ఈరోజు రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకూ "మోత మోగిద్దాం" అనే కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా