Home / పొలిటికల్ వార్తలు
రాష్ట్రంలోని మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె జగన్ సర్కారు పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏపీ సర్కారు మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లు బహిర్గతం చేయాలన్నారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ లీడర్ నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు. లోకేష్ సమర్ధుడైతే ఇంట్లోని మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారని కామెంట్ చేశారు. ఈ మేరకు గుడివాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన లోకేష్ ఢీల్లీ పారిపోయి.. తన తల్లిని రోడ్లపై తిప్పుతున్నారని తీవ్రంగా విమర్శించారు.
తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. ‘నిజం గెలవాలి’ యాత్రను ప్రారంభించారు. ఈ మేరకు ముందుగా నారావారిపల్లెలో ఆమె తండ్రి, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు అరెస్ట్‌తో ఆవేదన చెంది మరణించిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శిస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం సాయంత్రమే తిరుమలకు చేరుకున్న ఆమె ఈరోజు వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు భువనేశ్వరికి స్వాగతం పలకగా.. దర్శనం అనంతరం వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశం చేస్తోంది రావణాసుర దహనం.., మనం చేద్దాం జగనాసుర దహనం చేద్దామని నారా లోకేష్ పిలుపునిచ్చారు. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని తెలిపారు.
రాజమండ్రిలో రేపు జనసేన టీడీపీసమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. తొలి సమావేశ వేదిక మంజీరా హోటల్లో ఏర్పాట్లను ఉమ్మడి తూ.గో. జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్, టీడీపి నేత ఆదిరెడ్డి వాసు , జనసేన రాజమండ్రి ఇంఛార్జి అత్తి సత్యనారాయణ పరిశీలించారు. ఈరోజు సాయంత్రానికి రాజమండ్రి టీడీపీ క్యాంపు కార్యాలయానికి నారా లోకేష్ చేరుకోనున్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మించిన నాయకుడు భారత దేశంలో లేరని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గుంటూరులో విలేఖరులతో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. కేంద్రంలో తాము చక్రాలు తిప్పలేదని, రాష్ట్రపతిని నియమించలేదని అన్నారు.
తాను జైలులో లేనని., ప్రజల హృదయాల్లో ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి ప్రజలకు లేఖ రాశారు. విధ్వంస పాలనను అంతం చేయాలనే సంకల్పంలో ఉన్నానని తెలిపారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితం గురించి జైలు గోడల మధ్య ఆలోచించానని అన్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మీడియా ప్రతినిధులతో, ప్రతిపక్షాల తో ఎలా వ్యవహరించాలి, బహిరంగ సభలలో ఎలా మాట్లాడాలి అన్నఅంశాలపై ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు.
దసరా పండుగను పురస్కరించుకొని.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఏపీ సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న సీఎం జగన్.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక