Published On:

J D Vance : భారత్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు.. 21 ప్రధాని మోదీతో భేటీ

J D Vance : భారత్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు.. 21 ప్రధాని మోదీతో భేటీ

J D Vance : అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ ఈ నెల 21 భారత్ పర్యటనకు రానున్నారు. విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. జేడీ వాన్స్ ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఇటలీతోపాటు ఇండియాలో పర్యటించనున్నారు. ఆయన ఇరుదేశాల నేతలతో ఉమ్మడి ఆర్థిక, భౌగోళిక రాజకీయాలపై చర్చిస్తారని ఉపాధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను సందర్శిస్తారని ఉప రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీతో సమావేశవువుతారు. ఆయా చారిత్రక ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాంస్కృతిక వేదికల్లో జరిగే కార్యక్రమాలకు కూడా ఆయన హాజరవుతారు.

 

 

ఉషా వాన్స్ తెలుగమ్మాయి..
అమెరికా ఉపాధ్యక్షుడి భార్య ఉషా చిలుకూరి యూఎస్‌లో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి. ఆమె పూర్వికులది ఏపీలోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గరలోని ఓ గ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980లో అమెరికాకు వలస వెళ్లారు. వీరికి ముగ్గురు పిల్లల్లో ఉష ఒకరు. ఉషా తల్లి మాలిక్యులర్‌ బయాలజీ, బయోకెమిస్ట్రీ రంగ నిపుణురాలు. ప్రస్తుతం ఆమె ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శాన్‌డియాగో విశ్వవిద్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్‌ పదవిలో ఉన్నారు. ఉషా తండ్రి రాధాకృష్ణ క్రిష్‌ చిలుకూరిగా అందరికీ పరిచయం. ఆయన ఏరోస్పేస్‌ ఇంజినీర్‌. యునైటెడ్‌ టెక్నాలజీస్‌ ఏరోస్పేస్‌ సిస్టమ్స్‌ ఏరోడైనమిక్స్‌ స్పెషలిస్ట్‌గా పనిచేశారు. కాలిన్స్‌ ఏరోస్పేస్‌లో అసోసియేట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

 

 

 

ఇవి కూడా చదవండి: