PM Kisan 20th Installment Update: పీఎం కిసాన్ 20వ విడుత నిధుల డేట్ వచ్చిందోచ్.. ఎప్పుడంటే?

Update on PM Kisan 20th Installment: దేశంలోని రైతన్నలకు పంట పెట్టుబడి కింద సాయం అందించేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా అన్నదాతలకు ప్రతి ఏటా రూ.6 వేలు సాయం చేస్తోంది. 3 విడుతలుగా రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. ఇప్పటి వరకు 19 విడుతలుగా నిధులు విడుదల చేసింది. అయితే 20వ విడత నిధులపై చర్చ జరుగుతోంది. జూన్‌లో 20వ విడుత నిధులు విడుదల చేసే అవకాశం ఉంది.
ఈ-కేవైసీ తప్పని సరి..
లబ్ధిదారుల్లో చాలామంది అర్హత లేనివారు, ఈ-కేవైసీ పూర్తి చేయనివారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం అనర్హత జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఉన్న వారిపేర్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పేర్లను తొలగిస్తున్నారు. పీఎం కిసాన్ రావాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి. సుమారు 3 కోట్ల మంది వరకు ఈ-కేవైసీ చేసుకోలేదని తెలుస్తోంది. ఎక్కువ మంది నూతనంగా పేర్లు నమోదు చేసుకునే వారు ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. 20వ విడత నిధుల విడుదలలోపు ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే రూ.2వేలు తమ ఖాతాలో జమ కానున్నాయి.
జూన్‌లో 20 విడుత నిధులు విడుదల..
19వ విడుతలో 9.8 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నాలుగు నెలలకోసారి మంజూరు అవుతాయి. 18వ విడుత నిధులు 2024 అక్టోబర్ 5న తేదీన విడుదల చేశారు. 19వ విడుత 2025 ఫిబ్రవరి 24న విడుదల చేయగా, 20వ విడుత నిధులు జూన్‌లో విడుదల కానున్నాయి