Last Updated:

Rajasthan: రాజస్థాన్ లో రాజకీయ రచ్చ.. సీఎంగా పైలట్ వద్దంటూ రాజీనామాలు

రాజస్థాన్ లో సీఎం మార్పు తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీస్తోందని చెప్పవచ్చు. సీఎంగా సచిన్‌ పైలట్‌ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గెహ్లాట్‌ వర్గం కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా నిరసన బావుటా ఎగురవేసింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన 82 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

Rajasthan: రాజస్థాన్ లో రాజకీయ రచ్చ.. సీఎంగా పైలట్ వద్దంటూ రాజీనామాలు

Rajasthan: రాజస్థాన్ లో సీఎం మార్పు తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీస్తోందని చెప్పవచ్చు. సీఎంగా సచిన్‌ పైలట్‌ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గెహ్లాట్‌ వర్గం కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా నిరసన బావుటా ఎగురవేసింది. ప్రభుత్వాన్ని కూల్చాలని తిరుగుబాటుకు చూసిన వ్యక్తిని ఎలా సీఎం చేస్తారని గెహ్లాట్ వర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెహ్లాట్‌ వర్గానికి చెందిన వ్యక్తినే సీఎం చేయాలని అధిష్ఠానాన్ని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన 82 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల ముందు కాంగ్రె‌స్ పార్టీకి కొత్త సమస్య తలెత్తింది. రాజస్థాన్‌ కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. రాజస్థాన్లో రోజురోజుకు రాజకీయ పరిణామాలు దీనస్థితిలోకి వెళ్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న అశోక్‌ గహ్లోట్ను సీఎం పదవిని వదులుకోవాలని చెప్పడమే ఈ సమస్యకు కారణమయ్యింది. సీఎం మార్పు కొత్త సీఎం ఎంపికపై తీవ్ర రచ్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఓ హైడ్రామా చోటుచేసుకుంది. గెహ్లాట్ వర్గానికి చెందిన వారినే సీఎం రేసులో ఉంచాలని కానీ 2020 ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించిన పైలట్ను ఎలా సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ గెహ్లాట్ వర్గీలు తీవ్ర ఆగ్రహవం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి ధరివాల్‌ నివాసంలో భేటీ అయ్యి, రాజీనామా నిర్ణయం తీసుకొన్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ వర్గానికి చెందిన 82 మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానంపై తిరుగుబాటు భావుటా ఎగురవేస్తూ మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషికి సమర్పించారు. పరిస్థితులు చేయి దాటిపోతున్నట్లు గ్రహించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం సీఎల్పీ భేటీని రద్దు చేసింది. గెహ్లాట్, పైలట్‌ సహా ఖర్గే, మాకెన్‌ను ఢిల్లీకి రావాలని ఆదేశించింది. ఈ తరుణంలో ఆ 82 మంది రాజీనామాలను స్వీకర్ ఆమోదిస్తారా లేదా, కాంగ్రెస్ ప్రభుత్వం పైలట్ సీఎం అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తుందా, లేదా మామాటే శాసనం అన్నట్టు వ్యవహరిస్తుందా అనేది వేచి చూడాలి.

ఇదీ చదవండి: గులాం నబీ ఆజాద్ కొత్తపార్టీ పేరు ప్రకటన నేడే..!

ఇవి కూడా చదవండి: